AI Tools తో job opportunities ఎలా మారుతున్నాయి? యువత కోసం ఇది ఒక కొత్త దారి!
--- 2025 లో మనం జీవిస్తున్న ప్రపంచం వేగంగా మారిపోతుంది. ప్రత్యేకంగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులు ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్నాయి ఒకవైపు కొంతమంది ఉద్యోగాలు పోతున్నాయి అని బయపడుతుంటే, మరోవైపు కొత్త అవకాశాలు కూడా తెరుచుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యువత ఏ దిశగా సాగాలి ? ఏం నేర్చుకోవాలి, కొత్తగా ఏమైనా చేయాలా అని అనుకుంటే ఈ ప్రశ్నలకి సమాధానంగా ఈ రోజు మనం AI తో ఉద్యోగ అవకాశాలలో మార్పుల గురించి మాట్లాడుకుందాం...
AI వలన ఉద్యోగాలు పోతున్నాయ ? అది నిజమేనా? ప్రత్యేకంగా కొన్ని ట్రెడిషనల్ జాబ్స్ ఆటోమేషన్ వలన తగ్గుతున్నాయి. ఉదాహణకు: data entry, basic customer support, repetitive manual work లాంటి ఉద్యోగాలు AI ద్వారా automate అవుతున్నాయి. కానీ ఇది ఒకవైపు మాత్రమే, మరోవైపు కూడా ఇప్పుడు చూద్దాం...
-- కొత్త ఉద్యోగాలు - కొత్త అవకాశాలు:
- Al వల్లే చాలా కొత్త రకాల ఉద్యోగాలు వచ్చాయి. ఇవి పూర్తిగా 2025 లో youth కి అవసరమైన డిమాండ్ ఉన్న జాబ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం...
1, prompt Engineer :- chatgpt లాంటి టూల్స్ కి questions prepare చేయడం
2, AI trainer లేదా data annotator - AI ని train చేసి data provide చేయడం.
3, AI -based content creator - videos, blogs and reels ఇవ్వన్నీ AI తో రూపొందించడం.
4, AI మార్కెటింగ్ స్పెషలిస్ట్ - AI Tools ద్వారా డిజిటల్ మార్కెటింగ్ strategies తయారు చేయడం.
5, ఆటోమేషన్ స్పెషలిస్ట్ - Small businesses కోసం AI workflow tools అమలు చేయడం.
వీటికి ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో తెలుసా...
- linkedin లాంటి platforms లో 2025 మొదటి 6 నెలల్లో AI skill required జాబ్స్ 3 రేట్లు పెరిగాయి తెలుసా...
-- free lancing platforms (upwork, Fiverr) లో AI related జాబ్స్ కి 1hour కి ఎంత ఉందో తెలుసా money 1000 నుంచి 5000 వరకు తీసుకుంటున్నారు.
-- ఇండియా లో చాలా startups ఇప్పుడు AI Tools ఆధారంగా పని చేస్తున్నాయి. ఈ రంగంలో internships జాబ్స్ పెరుగుతున్నాయి.
*వీటికి తగ్గట్లుగా ఇప్పుడు ఉన్న యువత ఏం చేయాలి ఎలా సిద్దం కావాలి ఇప్పుడు తెలుసుకుందాం ...
-- ఈ మారుతున్న ఉద్యోగ మార్కెట్ కి యువత ఎలా సిద్దం కావాలి అంటే:-
1, free learning platforms:-
-- Google AI course
-- prompt engineering learn on YouTube లేదా linkedin learning
-- Coursera:- AI for everyone (by Andrew NG)
2, Small projects చేయండి అవి ఎంటి అంటే:-
-- canva, chatgpt, Notion AI లాంటివి వాడి చిన్న చిన్న కంటెంట్ projects చేయండి.
-- Resume, cover letter, blog writing లాంటి ప్రాక్టీస్ చేయండి.
3, portfolio తయారు చేయండి:-
-- మీరు చేసిన AI project's ని ఒక website లేదా linkedin profile లో చూపించుకొండి.
*AI మనిషిని భర్తీ చేయదు :-
-- AI మనిషిని భర్తీ చేయదు కానీ AI వాడగలిగిన మనిషి మాత్రం వీటన్నిటిలో ముందు ఉంటాడు ఇది నిజం.
-- ఇది ఒక అత్యంత ముఖ్యమైన విషయం మీరు ఒకవేళ AI ని వాడగలిగితే మీరు ఆ Tools ని నియంత్రించగలిగితే మీ job పోయే భయం ప్రమాదం లేకుండా ఉండవచ్చు. అనేక రంగాల్లో AI ని ఒక సహాయంగా ఉపయోగించి productivity నీ పెంచుకోవచ్చు.
చివరి మాట:- : మీరు భయపడకండి AI ని different types లో నేర్చుకోండి...
-- చిన్నగా ప్రారంభించండి ప్రతిరోజూ ఒక కొత్త tool గురంచి తెలుసుకోండి నేర్చుకొండి. ఒక్క 2 నెలల్లోనే మీ skills పెరుగుతాయి, మీ confidence రెండూ మారిపోతాయి. AI అంటే భయపడకండి దాన్ని మీ గ్రోత్ కోసం ఉపయోగించుకోండి.
మీరు ఇప్పటివరకు AI Tools తో ఏం నేర్చుకున్నారు అనేది comments లో మీ అభిప్రాయం రాయండి ఈ information మీకు ఎంత use అయ్యిందో కూడా నాకు తెలియచేయండి...
Thank you for your reading...
h
0 కామెంట్‌లు