Who is Parag Agarwal? Parag Agarwal AI startups, మాజీ ట్విట్టర్ CEO Parag Agarwal ఇప్పుడు ఎందుకు trend అవుతున్నాడు ?

Parag Agarwal AI startups. మాజీ Twitter CEO Parag Agarwal.

* ప్రస్తుతం మాజీ Twitter CEO Parag Agarwal ఎందుకు trend అవుతున్నాడు ఏం జరిగింది అని క్లారిటీగా తెలుసుకుందాం:-

-- పరాగ్ అగర్వాల్ పరిచయం:-


-- ఒకప్పుడు పరాగ్ అగర్వాల్ అంటే టెక్ ప్రపంచంలో తెలియని వాళ్ళు లేరు, మామూలు సాఫ్టువేర్ ఇంజనీర్ గా మొదలు పెట్టిన ఆయన ప్రయాణం తర్వాత అతను పని చేసిన Twitter సంస్థకే CEO గా నియమించబడ్డాడు.

-- ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అతను తన CEO పదవిని కోల్పోవడం అన్ని కూడా ఒక వింతలాగ జరిగిపోయాయి.

-- మళ్ళీ ఇప్పుడు అతను ఎందుకు వార్తల్లో నిలుస్తున్నారు, ఏం జరిగింది అంటే అతను కొత్తగా ఒక AI startup ప్రారంభిస్తున్నారు అని సమాచారం అందుకే ఇప్పుడు అతను సోషల్ మీడియాలో, వార్తల్లో, Google లో trend అవుతున్నాడు.


* పరాగ్ అగర్వాల్ నేపథ్యం తెలుసుకుందాం:-


-- పరాగ్ అగర్వాల్ 1984 మే 21 న రాజస్థాన్ లోని అజ్మీర్ లో జన్మించాడు.

-- అతని యొక్క చదువు:- B.tech computer science, IIT Bombay లో పూర్తి చేశాడు.

తర్వాత stanford University లో Masters అలాగే P.HD కూడా పూర్తి చేశాడు.

-- Parag Agarwal కి చిన్నప్పటినుండే కంప్యూటర్స్ అన్నా అలాగే గణితం అన్నా ఇష్టం ఉండేది అంటా, దాని related గానే అతను చదువుకొని టెక్ రంగంలో ఎదిగి అమెరికాలో స్థిరపడ్డాడు.



*అగర్వాల్ యొక్క Twitter ప్రయాణం:-

 
-- అగర్వాల్ మొదటి సారిగా 2011 లో software engineer గా ట్విట్టర్ లో చేరాడు.
-- తర్వాత CTO ( Chief Technology Officer) గా 2017 వ సంత్సరంలో ప్రమోషన్ దక్కించుకున్నాడు.

-- తర్వాత కాలంలో Twitter ని స్థాపించిన jack Dorfi 2021 లో CEO పదవి నుంచి తప్పుకున్నాడు, తర్వాత అతని స్థానంలో అగర్వాల్ ట్విట్టర్ కి కొత్త CEO గా బాధ్యతలు చేపట్టాడు.


-- ఇక్కడ అతని యొక్క నైపుణ్యం అంకితభావం, కష్టపడే తత్వం వల్ల జస్ట్ 8 సంవత్సరాలలోనే ఒక సాధారణ ఇంజినీర్ నుండి ఒక CEO స్థాయికి అతను ఎదిగాడు, అధి మన అందరికీ ఒక inspiration అవ్వాలి అనుకుంటున్న.


* కొంతకాలం తర్వాత CEO పోస్టు పోవడం:-


-- 2022 వ సంవత్సరంలో Twitter ని ఎలాన్ మస్క్ కొనుక్కున్న తర్వాత పరిస్థితులు చాలా మారాయి .

ఎలాన్ మస్క్ ట్విట్టర్ కంపెనీ ని తీసుకున్న తర్వాత కొద్ది రోజుల్లోనే మస్క్ పరాగ్ ఆగర్వాల్ ని తను ఉన్న CEO పదవి నుంచి తీసివేశాడు 


కానీ 2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వెంటనే పరిస్థితి మారింది. ప్రపంచం మొత్తం అధి ఒక పెద్ద చర్చకి దారి తీసింది, తర్వాత పరాగ్ కి నష్ట పరిహారం చెల్లించినా కూడా, ఉన్నట్లుండి CEO పదవి పోవడం అనేది ఒక బాధగా మిగిలింది.


* అవ్వన్నీ ఎప్పుడో అయిపోయాయి మరి ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతున్నాడు:-


-- పరాగ్ ఆగర్వాల్ ప్రస్తుతం ఎందుకు వార్తల్లోకి వచ్చాడు, అతను వార్తల్లోకి రావడానికి కారణం కొత్తగా ఆయన స్టార్ట్ చేసిన AI startup- Parallel web systems. మెయిన్ రీసన్.


* మరి ఈ స్టార్టప్ లో అంతగణం ఏం స్పెషాలిటీ ఉంది ?


-- పరాగ్ ఆగర్వాల్ ఈ కంపెనీని 2023 లోనే స్థాపించారు కానీ ఇప్పుడు అధి ఈ 2025 సంవత్సరానికి ఆగష్టు నెల వరకు $ 30 మిలియన్ల ఫండ్ ని సేకరించింది, కాబట్టి ఇప్పుడు అతను ట్రెండ్ అవుతున్నాడు.

ఇది కూడా చదవండి 2025 లో AI Tools తో యువతకి కొత్త ఉద్యోగ అవకాశాలు.

* మరి ఈ స్టార్టప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి ?


-- ప్రస్తుతం ఉన్న AI ఏజెంట్లు ఉన్నాయి కదా అవి చాలా తెలివి కలిగినవి కదా వాటిని ఇంకా తెలివి కలిగినవిగా మార్చడం కోసం ఏర్పాటు చేయబడ్డ కంపెనీ ఈ parallel web systems. ఇది స్థాపించింది పరాగ్ ఆగర్వాల్.


-- ప్రస్తుతం మనకు చాలా AI లు అందుబాటులో ఉన్నాయి. example:- ChatGpt , deepseek అలాగే Gemini, ఇవి మనకు ప్రి ట్రెయిన్డ్ డేటా ఆధారంతో సమాధానాలు చెప్తాయి.

-- పరాగ్ start చేసిన స్టార్టప్ మాత్రం అలా కాదు , AI స్వతంత్రంగా ఇంటర్నెట్ లో ఉన్న సమాచారాన్ని బ్రౌస్ చేసి తాజా information నీ సేకరించి దాన్ని నిజమా కాదా అని దృవికరించి ఆ తర్వాత యూజర్స్ కి ఇవ్వాలి. అంటే నార్మల్ గా ఉండే చాట్ బాట్ లాగా కాకుండా, నిజంగా ఒక information ని ఒక అసిస్టెంట్ గా రీసెర్చ్ చేసి ఇస్తుంది.


* దీని మీద అంతగనం పెట్టుబడి పెట్టడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు:-


-- ఇప్పటివరకు పరాగ్ ఆగర్వాల్ స్టార్ట్ చేసిన parallel web systems కి ఫస్ట్ రౌండ్ క్యాపిటల్, ఇండెక్స్ వెంచర్స్, అలాగే khosla ventures లాంటి చాల పెద్ద పెద్ద కంపెనీలు ఇందులో పెట్టుబడి నిధులు సమకుర్చాయి అని చెప్తున్నారు.


-- అతను చెప్పిన సమాచారం ప్రకారం భవిష్యత్తులో AI రంగంలో AI dynamic web అనే ఐడియా ఒక మంచి విప్లవాత్మకమైన change తీసుకువస్తుంది అని నమ్ముతున్నారు.


-- ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం అందరం use చేస్తున్న Chat Gpt -5 కంటే కూడా ఇది ఇంకా తెలివిగా వర్క్ చేస్తుంది అని చెప్పడంతో ఈ project మీద అందరికీ మరింత ఆసక్తి పెరిగింది.


*మరి ప్రజల్లో ఎందుకు అంత హడావిడి అవుతుంది ?


1, ఒక సాధారణ ఇంజినీర్ నుండి CEO గా ఎదిగి తర్వాత ఇప్పుడు ఒక entrepreneur గా ఎదగడం  అలాగే తను కోల్పోయిన CEO పదవి తర్వాత మళ్ళీ ఇప్పుడు AI రంగంలో తన journey ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.


2, అతను ఇండియాకి సంబంధించిన వ్యక్తి, అలాగే అతను ఐఐటీ బాంబే లో చదువుకొని ఈ స్థాయికి ఎదిగిన భారతీయుడు ఒక సిలికాన్ వ్యాలీలో ఇంత పెద్ద స్థాయిలో ఒక AI startup ని ప్రారంభించడం అనేది భారత ప్రజలకి ఒక స్ఫూర్తిని ఇస్తుంది.


3, ప్రస్తుతం ఒక ChatGpt తోటి పోటీ పడి అంతకు మించిన కొత్త technology అభివృద్ధి చేస్తా అని అతను చెప్పడం ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అందుకే ఇప్పుడు అతను సోషల్ మీడియాలో Google లో ట్రెండ్ అవుతున్నాడు.


* ముగింపు మాటలు:-


-- ఒక సాధారణ ఇంజినీర్ నుండి ఒక కంపెనీకి CEO గా ఎదిగి, తర్వాత అది పోయినా కూడా దిగులు చెందకుండా ఇంకా ఎక్కువగా పట్టుదలతో ముందుకి వెళ్ళి ఇప్పుడు ఒక గొప్ప AI స్టార్టప్ స్టార్ట్ చేసి ప్రస్తుతం ఉన్న టెక్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి అని ఇంకా మంచి క్వాలిటీ information ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తున్న పరాగ్ అగర్వాల్ నిజంగా మనకు అందరికి ఒక మంచి inspiration.


- ఈ information మీకు ఎలా అనిపించిది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, thank you for your Reading .



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు