విజయ్ దేవరకొండ నటించిన kingdom movie review

 

Kingdom movie review



Tollywood new movie Kingdom review ఇది ఒక thriller జోనర్ మూవీ 

నటి నటులు:-

--  విజయ్ దేవరకొండ (సూరి) భాగ్యశ్రీ , మరియు సత్యదేవ్ గారు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఒక సామాజిక మెసేజ్ తో పాటు మంచి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుంది...


 -- kingdom movie ఈ నెల 31 జూలై 2025 న World wide ga గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి.


Kingdom సినిమా కథ మరియు థీమ్ ఎలా ఉంది చూద్దాం:-

-- విజయ్ దేవరకొండ ఒక undercover constable గా  శ్రీలంకలో ఉన్న వాళ్ళ అన్నయ్య ని వెతుకుతూ కుట్రలతో నిండి ఉన్న ఒక భయంకరమైన ప్రాంతంలోకి  అడుగెడతాడు. అతని ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు వెళ్తాడు అందులో రాజకీయం అలాగే అతని వ్యక్తిగత బాధ్యతలతో తలపడతాడు. అవ్వన్నిటి మేళవింపుతో మూవీ అయితే ఒక మంచి ఉత్కంఠ భరితమైన ఫీలింగ్ ని కలిగిస్తుంది.


 -- ఈ సినిమా లో విజయ్ దేవరకొండ ఒక powerfull performance తోటి  ప్రేక్ష‌కుల మనసులని గెలుచుకున్నాడు అనే అనిపిన్చింది.


 -- ఇకపోతే ఇందులో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ బోర్స్ అనే అమ్మాయి తెలుగులో మొదటి మూవీ అయినా కూడా ఆమె పాత్ర సినిమా కథకి చాలా కీలకం అవుతుంది. ఆమె నటన కూడా బాగుంది.


-- సత్యదేవ్ కూడా ఒక మంచి ఉత్కంఠ భరితమైన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాడు. అలాగే మూవీ కి అతని పాత్ర కూడా చాలా కీలకం.


-- kingdom movie కి సంబంధించిన సాంకేతిక నిపుణులు మరియు విజువల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం.


 -- ఈ సినిమా కి పని చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఇచ్చిన music అలాగే ప్రేక్షకులను కట్టి పడేసే background music తో సినిమాని నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. ఆ background music వింటుంటే నిజంగా నాకు goosebumps వచ్చాయి చాలా బాగా ఇచ్చాడు BGM.


 -- camera మరియు editing లో Jomon T. John మరియు గిరీష్ గంగాధరన్ లాంటి టెక్నీషియన్ లు ఈ సినిమా కి పని చేశారు. అలాగే editing విషయంలో చాలా జాగ్రత్తగా చేశారు అనిపించింది.


-- ఈ మూవీ బలాలు మరియు బలహీనతలు తెలుసుకుందాం:-


-- kingdom మూవీ బలాలు ఫస్ట్ తెలుసుకుందాం:-


-- సినిమా మొదటి భాగంలో ఉత్కంఠభరితమైన కథ కథనాలతో ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదు వేరే లెవెల్లో ఉంది.

-- అనిరుద్ ఇచ్చిన music kingdom మూవీ కి ప్రాణం పోసింది అని చెప్పుకోవచ్చు.

-- విజువల్స్ మరియు spy + పాలిటిక్స్ అవ్వన్నీ కళ గలిపి సినిమాని నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్ళాయి అని చెప్పవచ్చు. 

  

 -- kingdom మూవీ బలహీనతలు చూద్దాం:-


-- సినిమా మొదటి భాగం కంటే రెండవ భాగం కొంచెం అంచనా వేసే విధంగా అలాగే కొంచెం నార్మల్ గా ఉంది. కానీ పర్లేదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం సినిమాని ఒక రేంజ్ లో పెట్టింది. అనిపించింది నాకు అయితే.


* Kingdom movie  బాక్సాఫీస్ అంచనాలు ఎలా ఉన్నాయి చూద్దాం:-


 -- కింగ్డమ్ మూవీ మొదటి రోజు ప్రంచవ్యాప్తంగా 15 నుండి 20 కోట్ల వరకు రాబడుతుంది అని అలాంటి అంచనాలు ఉన్నాయి అని గణాంకాలు చెబుతున్నాయి. మరి ఏం అవుతుందో చూడాలి ఎన్ని కోట్లు వస్తాయి అనేది చూడాలి. 


-- చివరగా నాకు అయితే ఈ మూవీ బాగా నచ్చింది. అలాగే విజయ్ దేవరకొండ కి మంచి comeback movie అవుతుంది అనిపిస్తుంది ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే మీకు ఏం అనిపించింది అనేది చెప్పండి.

ఇప్పటివరకు న నా article చదివినందుకు thanks...





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు