-- భారతదేశంపై ట్రంప్ 25% సుంకం విధించాడు దానికి గల కారనాలు ఏంటో ఎందుకు విధించారు అనేది క్లారిటీగా ఇప్పుడు తెలుసుకుందాం...
* --1 తారీకు ఆగస్టు నెల 2025 నుండి అమెరికాకి అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ భారత్ నుండి దిగుమతి అవుతున్న వస్తువులపై 25% టారిఫ్ అంటే (దిగుమతి సుంకం అన్న మాట) విధిస్తున్నట్లు ట్రంప్ తెలియచేశాడు. ప్రస్తుతానికి ఈ ప్రకటన యావత్ ప్రపంచానికి చర్చకి దారి తీసింది.
-- నేను రాసిన ఈ సమాచారంలో మీరు దీని వెనుక ఉన్న నిజం ఎంటి అసలు ఏం జరిగింది. అలా చేస్తే మన భారత దేశం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది. దీని మీద మన దేశం ఎలా స్పందించింది అని పూర్తి సమాచారం ఇచ్చాను చదివి తెలుసుకోండి.
* Trump ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
-- ఇట్లాంటి నిర్ణయం మేము ఎందుకు తీసుకున్నాం అని ఒక కారణం అయితే Trump చెప్తున్నాడు అది ఎంటి అంటే రష్యా దేశం నుండి భారతదేశం ఎక్కువ మొత్తంలో నాఫ్తా అంటే క్రూడ్ ఆయిల్ ని కొనుగోలు చేస్తుంది అని చెప్పాడు. ఇప్పటికే రష్యా మీద అమెరికా చాలా ఆంక్షలు విధించింది ఆ నేపథ్యంలో భారత దేశం రస్యాతో ఎలా ఎంత పెద్ద మొత్తంలో వర్తకం చేస్తుంది అని భారత దేశాన్ని Trump విమర్శించి ఈ నిర్ణయం తీసుకున్నాడు అని నాకు అనిపిస్తుంది. అదే నిజం అవుతుంది కూడా present situation చూస్తుంటే.
-- అదే కాకుండా ఇక్కడ భారత ప్రభుత్వం కూడా అమెరికా దిగుమతి చేస్తున్న వస్తువులపై భారత్ అడ్డంకులు పెదుతుంది అని ట్రంప్ చెబుతున్నాడు అందుకే మేము కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం అని ఇది కూడా ఒక కారణం అవుతుంది అనిపిస్తుంది.
* అమెరికా మన దేశం మీద ఎలాంటి వస్తువులపై 25% టారిఫ్ విధించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
-- భారత దేశం నుండి దిగుమతి చేస్తున్న ఏ వస్తువులపై అమెరికా ఈ టారిఫ్ వేస్తోంది అనేది ఇప్పుడు చూద్దాం.
1, మొబైల్స్ (అందులోనూ మళ్ళీ చీప్ మోడల్స్) మీద పడుతుంది.
2, వేసుకునే దుస్తులు, జీన్స్ ల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది.
3, మనం ధరించే వెండి, బంగారు ఆభరణాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది.
4, మనం ప్రయాణాలకు ఉపయోగించే కార్ల తయారీకి కావలసిన స్పేర్ పార్ట్స్ మీద కూడా దీని ప్రభావం పడుతుంది.
5, మనం వైద్యానికి ఉపయోగించే ఫార్మా ఉత్పత్తులు ఇంకా ఔషధాల మీద కూడా దీని ప్రభావం పడుతుంది.
-- దీని అర్థం ఎంటి అంటే అమెరికాలో ఈ వస్తువుల అన్నిటిమీద ఇంతకముందు ఉన్న ధరల కంటే ఇంకా ఎక్కువ ధరలు పెరుగుతాయి. దీని వల్ల మన వస్తువులకు గిరాకీ తగ్గుతుంది. ఆదాయం తగ్గుతుంది.
* మరి దీని మీద మన భారత్ ఎలా స్పందించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
-- మన దేశంలో ఉన్న పలు వ్యాపార వర్గాల వారు అలాగే కొంత మంది రాజకీయ నాయకులు ఈ విషయం మీద తీవ్రంగా మండి పడ్డారు.
--- దీని మీద మన మాజీ ప్రధాని H.D. దేవెగౌడ ఇలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఏం మాట్లాడాడు అంటే ఇలాంటి విలువ లేని అటువంటి మాటలు మాట్లాడే నాయకులతో ప్రపంచం జాగ్రత్తగా ఉండాలి అని మోడీ గారు మన దేశ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారు అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
-- దీని మీద ప్రస్తుతానికి అయితే మన భారత ప్రభుత్వం వాషంగ్టన్, న్యూయార్క్ లో ఉన్న అధికారులతో చర్చలు కొనసాగిస్తూ ఒక మంచి పరిష్కారం కోసం అడుగులు వేస్తోంది.
-- మరి దీని మీద ప్రస్తుతానికి ప్రపంచం ఎలా స్పందిస్తుందో తెలుసుకుందాం...
-- ప్రపంచంలో కొన్ని దేశాల మీద కూడా అమెరికా ఇలాంటి టారిఫ్ లు విధించారు. మరి అందులో భాగంగా మెక్సికో, చైనా, కెనడా లాంటి దేశాల మీద కూడా విధించిన టారిఫ్ ల మీద ఆ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అని మండి పడుతున్నారు. ప్రపంచంలో ఇప్పుడు ఇది ఒక trade war ante వ్యాపార యుద్ధం లాగా మారే అవకాలు చాలా ఉన్నాయి ఇకముందు ఏం అవుతుందో మరి వేచి చూడాలి
* దీని వలన అమెరికా-భారత్ మధ్యలో భవిష్యత్తులో ఎలాంటి సంభంధాలు ఉండబోతున్నాయి ఎలాంటి ప్రభావం పడబోతోంది అనేది వేచి చూడాలి ఇగా...
-- ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు చూసినట్లయితే అమెరికా మరియు భారత్ మధ్య కటినమైన సంభంధాలు ఏర్పడే లాగా అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో...
-- అయితే ఇంకో పక్క ఇప్పటికే అమెరికా పాకిస్తాన్‌తో సంబంధాలు బలపరచుకుంటోంది దీని వల్ల భారత్ కూడా వేరే దేశాలతో యూఏఈ, ఫ్రాన్స్, జపాన్ లతో వ్యాపారాలకు సంభందించిన చర్చలు జరుపుతూ ఒప్పందాలు కుదుర్చుకునే దిశలో అడుగులు వేస్తోంది.
* ఇక ముగింపు ఇస్తున్నా...
డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం 25% టారిఫ్ ఒక్కటే కాదు, ఇది ఒక వ్యాపార విషయమే కాదు దీని వల్ల అమెరికా మరియు భారత్ ల మధ్య సంబంధాలపై అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ పై వ్యాపారాల సమీకరణపై ప్రపంచ స్థాయిలో ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
* మరి ఇప్పుడు భారత దేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. ఎది ఏమైనా దేశ ప్రయోజనాల దృష్ట్యా దేశ ప్రజలకి మంచి జరిగే విషయంలో భారత ప్రభుత్వం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి అని నేను ఆశిస్తున్న.
-- మరి మీరు ఏం అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తున్నారు. మీరు ఏం అనుకుంటున్నారు. మరి Trump తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నారా తప్పు అనుకుంటున్నారా ? మన భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం నాకు తెలియచేయండి.
ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి నా Blog Trendtelugu.world ని సజెస్ట్ చేయండి ఇలాంటి trending issues కోసం మీరు మన website ని daily follow అవ్వండి thank you for your reading...
0 కామెంట్‌లు