Hello friends, 2025, 30 తారీకు జూలై నెలలో జపాన్‌లో వచ్చిన భూకంపం అలాగే సునామీ కీ సంభందించిన హెచ్చరికలు జారీ చేశారు ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మళ్లీ జపాన్‌ను భయానికి గురిచేసిన మరో భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రతతో మాగ్నిట్యూడ్ గా నమోదయ్యింది. ఈ భూకంపం మరీ ముఖ్యంగా హోకైడో ప్రాంతం మీద దాని ప్రభావాన్ని చూపించింది. (JMA) జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ దీని మీద వెంటనే సునామీ కి సంబంధించిన హెచ్చరికలను జారీ చేసింది... ఈ సంఘటన ఆ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో భయాన్ని కలిగించింది...దాంతో వాళ్ళు అయోమయ స్థితిలో ఉన్నారు...
* ఇప్పుడు ఆ భూకంపానికి సంభందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం...
* ఆ భూకంపం తీవ్రత ఎంత ఉంది అంటే రిక్టర్ స్కేల్ పై 8.8 గా నమోదు అయ్యింది అని చెబుతున్నారు ఆ దేశ అధికారులు.
*ఏ సమయంలో భూకంపం సంభవించింది అంటే 30 తారీకు జులై నెలలో 2025 ఉదయ కాల సమయంలో 10:45 (జపాన్ టైకి వచ్చింది అని చెబుతున్నారు)
* ఏ ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది అంటే హోకైడో అనే తూర్పు తీర ప్రాంతం వద్ద సముద్ర మట్టానికి దిగువన ఉన్న ప్రభావిత ప్రాంతాలు అయిన హోకైడో, అఓమోరీ, సపోర అనే ప్రాంతాలలో వచ్చింది.
* దీని తర్వాత వెంటనే అలెక్ట్ అయిన అధికారులు హెచ్చరికలు జారీ చేశారు దానికి సంభంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
* ఇక్కడ జపాన్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం సముద్రంలో ఈ భూకంపం కేంద్రానికి దగ్గరగా నీటి అలలు అనేవి 1 నుండి 3 మీటర్ల ఎత్తుగా వచ్చే అవకాశం ఉందని సమాచారం ఇచ్చారు. దీంతో తీరప్రాంతాలలో నివశిస్తున్న ప్రజలను అందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్పడం జరిగింది...
* తదుపరి సునామీ వచ్చే అవకాశం ఉందని చెప్పిన అధికారులు ఏ ప్రాంతాలకి ముప్పు ఉంటుంది అని ఆ ప్రాంతాలకి హెచ్చరికలు జారీ చేశారు ఆ ప్రాంతాలు ఏంటో చూద్దాం.
1, హోకైడో తూర్పు తీరాలు.
2, కుషీరో, నెమురో ప్రాంతాలు.
3, పసిఫిక్ ఒడ్డున ఉన్న ప్రాంతాలన్నీటికీ హెచ్చరికలు జారీ చేశారు.
* ఈ భూకంపం వల్ల అక్కడ ఎలాంటి ప్రభావాలు పడ్డాయి ఇప్పుడు తెలుసుకుందాం.
-- ఈ భూకంపం వల్ల కొన్ని ప్రాంతాల్లో భవనాలు కంపించడం జరిగింది.
-- అలాగే అక్కడ ఉన్న ప్రాంతాలకి విద్యుత్ సరఫరాలో అంతరాయం కూడా కలిగింది.
-- తర్వాత రైలు అలాగే మెట్రోకి సంబంధించిన సేవలు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి అని అక్కడి అధికారులు చెప్పడం జరిగింది.
-- జపాన్ లో ఉన్న హోకైడో ప్రాంతంలో నివసిస్తున్న పదిమంది ప్రజలు గాయపడినట్లు సమాచారం అయితే ఇచ్చారు.
-- అక్కడ ఉన్న పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ప్రస్తుతానికి మూసివేయబడ్డాయి అని చెబుతున్నారు...
* అసలు ఈ జపాన్‌లో భూకంపాలకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ఇది కూడా చదవండి టువాలు దేశం సముద్రంలో మునుగుతుంది.
-- జపాన్ దేశం నాలుగు టెక్టానిక్ ప్లేట్‌లకి మధ్యలో ఉంది. (Pacific, North America, Philippine, Eurasian,). వీటి కారణం వల్ల జపాన్ దేశం భూకంపాలను అనుభవిస్తున్న అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం మైక్రోప్లేట్‌ల మధ్య జరిగే ఘర్షణల వల్ల ఇక్కడ ఎప్పటికీ భూకంపాలు వస్తుంటాయి అని నిపణులు చెబుతున్నారు...
* దీనికోసం జపాన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటో తెలుసుకుందాం...
-- ఆ ప్రాంతాలకి సంబంధించిన ప్రజలందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు అని సమాచారం.
-- అక్కడ నివసిస్తున్న ప్రజల కోసం జపాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు అని చెబుతున్నారు.
* జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ (JMA ) నూతనంగా ఒక మల్టీ లెవల్ అలర్ట్ సిస్టమ్‌ను తీసుకొని వచ్చి అమలు చేసింది అని సమాచారం.
-- అంతే కాకుండా జపాన్ తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మొబైల్ అలర్ట్స్ అలాగే టీవీ & రేడియోల ద్వారా హెచ్చరికలు కూడా పంపించారు అంటా...
* జపాన్ లో ఉన్న భారత పౌరులకు సూచనలు కూడా ఇచ్చారు...
-- అవి ఎంటి అంటే భారత దౌత్యసంస్థలు అలాగే జపాన్‌లో ఉన్న భారత పౌరులందరిని కూడా అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఎవరైనా ఆ ప్రమాదాల్లో చుక్కుకుంటే వారికి సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ నంబర్ లను కూడా విడుదల చేశారు అక్కడ ఉన్న జపాన్ ప్రభుత్వం.
* ముగింపు:-
-- జపాన్ దేశం ఎప్పటికీ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే దేశం. అయినా కూడా వారి యొక్క సాంకేతికత అలాగే వాళ్ళ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ నష్టాలతో బయటపడుతున్నారు అని నిపుణులు అంటున్నారు. ఈ సంఘటన కూడా మనకు ఒక హెచ్చరిక మరియు గుణపాఠం కూడా చెబుతోంది. అది ఎలా అంటే ప్రకృతి శక్తుల ముందు మనం ఎంత బలహీనులమో తెలియచేస్తుంది. అలాగే మనం కూడా ప్రకృతిని కలుషితం చేయకుండా దాన్ని రక్షిస్తూ మనల్ని మనం రక్షించుకుంటూ సురక్షితంగా ఎలా ఉండాలో ప్రకృతి మానవులకు నేర్పుతుంది. కాని మనం మాత్రం ఇంకా ప్రకృతిని కలుషితం చేస్తూ నాశనం చేస్తూ ఉంటే ఎదో ఒక రోజు ఈ ప్రకృతి మానవుల మనుగడ అనేది లేకుండా చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మానవులు అందరం ప్రకృతిని రక్షిస్తూ మనల్ని మనం రక్షించుకుందాం మీరు ఏం అంటారు మరి నాకు తెలియచేయండి... ధన్యవాదములు...
0 కామెంట్‌లు