Raakhi pandaga celebrations


 

* రాఖీ పండుగ పరిచయం:- సోదరులకు సోదరీమణులకు ఇది ప్రత్యేక పండగ.


-- మన భారత దేశ సంప్రదాయాలలో , ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మమతలకి, కుటుంభానికి, కుటుంభ బంధాలకు, విలువలకు ఒక మహోన్నతమైన ప్రత్యేక స్థానం ఉంది. అందులో భాగంగా రాఖీ పౌర్ణమి పండగ లేదా రక్షా బంధన్ పండగ అనేది అన్న, చెల్లెళ్ళు, అక్కా, తమ్ముళ్ళ మధ్య లో ఉన్న అనుబంధ భాందవ్యాన్ని ఇంకా ఎక్కువగా బలపరిచే పవిత్రమైన పండగే ఈ రాఖీ పౌర్ణమి.


-- ఈ పర్వ దినాన సోదరి(అక్క లేదా చెల్లి) వాళ్ళ సోదరునికి(అన్న లేదా తమ్ముడు)కి   రాఖీ కడుతుంది. అలా రాఖీ కట్టడం ద్వారా సోదరీ తన ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని, భందాన్ని తెలియచేస్తుంది. అక్క లేదా చెల్లి వాళ్ళ అన్న తమ్ముళ్ల మీద ఎనలేని ప్రేమని చూపిస్తారు, చిన్నప్పటినుండే అన్నీ ఇష్టాలని తినే వాటి దగ్గర నుండి వేసుకునే బట్టల వరకు, చదువు, పని అన్నీ కూడా అక్క చెల్లెలు ప్రేమతో ఇచ్చేస్తారు, వాళ్ళకి ఏమైనా అయితే గుక్క పెట్టి మరి ఏడుస్తారు చాలా సెంటిమెంటల్ గా ఉంటారు, వాళ్ళకి కావలసినవి అన్నీ చేసి పెడతారు, చాలా సాకిర్ఫైస్ చేస్తారు, లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన అన్నీ వాళ్ళ లోపల పెట్టుకొని వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతారు బయటికి చెప్పుకోరు, పెళ్లి తర్వాత ఇంకా ఎక్కువగా వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చిన అన్నీ తట్టుకొని బ్రతుకుతారు, అన్న తమ్ముళ్ళకి అమ్మ నాన్నలకి చెప్తే వాళ్ళు ఎక్కడ బాద పడతారో అని ఏది చెప్పకుండా అన్నీ బరిస్తూ బ్రతుకుతారు, ఇంట్లో వాళ్ళకి కష్టం వచ్చింది అంటే మాత్రం తట్టుకోలేరు పరుగెత్తుకుంటూ మరి ఇంటికి వెళతారు వాళ్ళని చూసుకంటారు, రాఖీ పండగ వస్తే ఆడ బిడ్డలకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది తన అన్నకి తమ్ముడికి రాఖీ కట్టాలి వాళ్ళు క్షేమంగా నిండు నూరేళ్ళు బ్రతకాలి అని కోరుకుంటుంది అలాగే నాకు అన్నీ విషయాలలో నా అన్న తమ్ముడు దైర్యంగా ఉంటారు నాకు తోడుగా ఉంటారు నన్ను కాపాడుతారు నాకు రక్షగా ఉంటారు అని ప్రేమతో రక్షా భందన్ కడతారు సంతోషం గా వెళతారు వాళ్ళ ప్రేమని వ్యక్తపరచి వెళతారు.   

-- సోదరుడు కూడా అంతే ప్రేమగా తన సోదరికి ఎన్ని కష్టాలు వచ్చినా అన్నీ సమస్యలకి తానే ముందు ఉండి అన్నీ ఎదుర్కొని అవి చిన్న ప్రాబ్లమ్స్ అయిన పెద్ద ప్రాబ్లమ్స్ అయిన, అవి తనకి ముప్పు తీసుకువస్థాయి అని తెలిసిన కూడా తన అక్క లేదా చెల్లి కోసం తాను ఎంత రిస్క్ అయిన చేసి వాళ్ళని కాపాడుకుంటాడు, తన అక్క చెల్లి కష్టాలలో ఉంది అని తెలిస్తే వెంటనే పరుగెత్తుకుంటూ మరి వెళ్ళి వాళ్ళకి అండగా ఉంటాడు, అంతే కాదు అక్క లేదా చెల్లి పెళ్లి అవ్వడానికి అమ్మ నాన్నలతో సహ సగం బాద్యత అతనే తన మీద వేసుకొని మరీ దాన్ని ఒడ్డెక్కిస్తాడు, అలాగే తాను అత్తగారి ఇంట్లో మంచిగా సుకంగా బ్రతకాలి అని కోరుకుంటాడు, వాళ్ళ బావ ఎలాంటి కష్టాలు పెట్టకూడదు అని కోరుకుంటాడు, వాళ్ళ బావకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అలాగే ఒకవేళ బావ నుండి వాళ్ళ అక్క లేదా చెల్లికి కష్టం వచ్చింది వేదింపులు వస్తున్నాయి అని తెలిస్తే తన కన్నీళ్ళు చూస్తే రెస్పెక్ట్ ఇచ్చిన బావ కి గట్టిగా బయం కూడా చెప్తాడు, అక్క చెల్లెళ్లను కంటికి రెప్పల కాపాడుకుంటారు, పండగకి ఇంటికి వస్తే అక్క బావని చాలా మర్యాద చేస్తారు, అక్క చెల్లికి చీరలు లేదా కానుకలు, ఆభరణాలు లాంటివి కూడా ఇస్తారు మంచిగా చూసుకుంటారు, వాళ్ళకి మంచి విందు బోజనం కూడా చేసి మర్యాద చేస్తారు.   

 అన్నీ ప్రాబ్లమ్స్ నుండి రక్షించుకుంటానని అన్న తమ్ముళ్ళు వాళ్ళ అక్క చెల్లెళ్లకు హామీ ఇస్తారు.


* రాఖీ పండుగ యొక్క చరిత్ర మరియు నేపథ్యం:- 


-- రాఖీ పండుగ కి కొన్ని చారిత్రక కథలు అలాగే కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి. వాటిలో నుండి కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


1, మహా భారతంలోని ఒక కథ:-  

   -- శ్రీ కృష్ణుడు మహా భారతంలో శిశుపాలున్ని సంహరించేటప్పుడు,  కృష్ణుని చేతికి గాయం అవుతుంది. అది చూసిన ద్రౌపది వెంటనే ఆమె చీరలో నుండి ఒక ముక్కను చించి ఆ గాయానికి కడుతుంది. ఆమె ప్రేమకు కృతజ్ఞతగా ద్రౌపది ని ఎప్పటికీ కాపాడుతూ ఉంటా అని వాగ్దానం ఇస్తాడు. ఇక్కడే అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ ఒకరికి ఒకరు ఎవరు ఆపదలో ఉంటే వాళ్ళని మనం ఆదుకోవాలి అని కాపాడుకోవాలి అని వాళ్ళ ప్రేమని చాటుకోవాలి అని మనకి తెలియచేస్తనది, ఇదే కథ రాఖీ పండుగ రావడానికి ఒక పురాణ కథ గా కూడా చెప్పబడింది.

2, చారిత్రక కథలు:-

-- కర్నావతి అనే ఒక రాజస్థాన్ కి చెందిన రాణి ఒకసారి మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ కి రాఖీ పంపించి, ఆమె యొక్క రాజ్యాన్ని తన శత్రువుల నుంచి కాపాడమని వేడుకుంది అతను కాపాడుతా అని మాట ఇస్తాడు. దానికి బదులుగా హుమాయూన్ తను ఇచ్చిన మాట నిలపెట్టుకొని ఆ రాణిని కాపాడుతాడు. ఈ కథ కేవలం రక్త సంబంధాలకే కాకుండా మానవ సంబంధాలకు కూడా విలువలతో ప్రేమతో విస్తరించబడింది అని ఈ కథ రుజువు అవుతుంది. ఇలాంటి సంగటనలని మనం ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఏది అయిన కూడా ఎవరికి అయిన కష్టం వస్తే కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా మంచి మనసుతో వాళ్ళని ఆదుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తారు అని మంచి ప్రేమ అనురాగం భందం ఏర్పడి మనుషులు అంతా మానవత్వంతో బ్రతుకుతారు అని అలా మనం కూడా బ్రతకాలి అని ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాలి అని నాకు అర్ధం అయ్యింది. మరి మీకు ఏం అర్ధం అయ్యింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.    


3, ఇంద్రాణి మరియు ఇంద్రుని కథ :-

-- పురాణ కథల్లో ఇంద్రాణి ఒకసారి ఇంద్రునికి యుద్ధంలో విజయం జరగాలని ఒక పవిత్రమైన దారం కట్టింది. అది రక్షా తాడుగా పరిగణించ బడింది. దాన్నే ఇలా రక్షా భందన్ గా జరుపుకుంటాం అని కొంతమంది చెప్తారు. 

* మరి ఈ రాఖీ పండుగ ఎలా జరుపుకోవాలి ? 

-- ఈ రాఖీ పండుగ రోజు ముందుగా సోదరీ తన సోదరునికి బొట్టు పెట్టి , హారతి ఇచ్చి  తర్వాత ఆమె తెచ్చిన రాఖీ కడుతుంది. 

-- కట్టిన తర్వాత తీయగా చేసిన పదార్థాలను సోదరునికి తినిపిస్తుంది.

-- తర్వాత సోదరుడు అతని సోదరికి గిఫ్ట్స్ ఇచ్చి, నిన్ను నేను అన్ని కష్టాల నుంచి కాపాడతాను అని మాట ఇస్తాడు. దాని వల్ల వాళ్ళ మధ్య సోదర సోదరీ మణుల బంధం ఇంకా ఎక్కువగా ప్రేమగా ఆప్యాయంగా మారుతుంది. ఆ సమయంలో వాళ్ళ మద్య ఒక దైర్యం వస్తుంది నాకు ఏ కష్టం వచ్చిన నన్ను కాపాడటానికి నా అన్న ఉన్నాడు నా తమ్ముడు ఉన్నాడు అని, అలాగే నాకు ఎలాంటి సమస్య వచ్చిన నాకు తోడుగా నన్ను చూసుకోవడానికి నా అక్క ఉంది నా చెల్లి ఉంది అని ఒక దైర్యం వస్తుంది.  అధె ఈ రాఖీ పండగ ప్రత్యేకత.  


* ఇప్పుడు రాఖీ పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం:- 

 

1, రాఖీ పండుగ అనేది ఒక మంచి అనుబంధానికి నిదర్శనం:- 

-- రాఖీ అనేది కేవలం దారం మాత్రమే కాదు అధి ఒక ప్రేమకు, రక్షణకు, నమ్మకానికి, మధ్య నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డ ఒక మంచి పవిత్ర బంధంగా చెప్పుకోవచ్చు.


2, రాఖీ పౌర్ణమి విలువలతో కూడిన సంస్కృతి:- 

-- భారతీయ సంస్కృతిలో కుటుంబ బంధాలు ఎంత ముఖ్యమో రాఖీ పండుగ అందరికీ గుర్తు చేస్తుంది.


-- మనుషులు అందరూ ఎలా ఉండాలి అనేది ఈ సంస్కృతి మనకు తెలియచేస్తుంది కేవలం తొడబుట్టిన వాళ్ళ మద్యలోనే కాదు ఇతరులతో కూడా మనం అలాగే ఉండాలి కష్టంలో ఉన్న వాళ్ళకి తోడుగా ఉంది వాళ్ళని ఆదుకోవాలి అని తెలియచేస్తుంది. 


-- సాంస్కృతిక విలువలు – భారతీయ సంస్కృతిలో కుటుంబ బంధాలు ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది.


3, కులం, మతం, జాతి అనే వివక్ష లేని పండగ:-

-- భారత దేశం లో కులాలు మతాలు చాలా ఉన్నాయి కానీ ఆ తేడాలు ఏమీ లేకుండా ప్రతీ ఒక్కరు జరుపుకునే పండుగ ఈ రాఖీ పండుగ, అందరూ ప్రేమ, ఆప్యాయత, అనురాగాల తో ఈ రాఖీ పౌర్ణమి నీ సంతోషంగా జరుపుకుంటారు.


4, సమాజంలో ఐకమత్యం:-

-- ఈ రాఖీ పండుగ మన దేశంలో సమాజంలో ఐకమత్యాన్ని పెంచుతుంది. ఈ పండగ కేవలం సోదరులు సోదరీ మణులు మాత్రమే కాకుండా ఆప్తులు, స్నేహితులు, శ్రేయోభిలాశులు ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా ఈ రాఖీ పండుగ ని జరుపుకుంటూ సమాజంలో ఐకమత్యాన్ని పెంచుతున్నారు.


* మరి ఈ ఆధునిక కాలంలో రాఖీ పండుగ ఎలా జరుపుకుంటున్నారు ?

-- ప్రస్తుత ఆధునిక యుగంలో technology పెరెగడంతో, ఉద్యోగాలు ఉరుకుల పరుగుల జీవితంలో ఈ రాఖీ పండుగ ని ఇలా కూడా జరుపుకుంటున్నారు.
-- కుటుంబాలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబధీకులు ఒకవేల దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్లు వాళ్ళ ప్రేమను online ద్వారా తెలియచేస్తున్నారు. Online లో రాఖీ లను send చేసి ఈ రాఖీ పండుగ జరుపుకుంటున్నారు.

* రాఖీల రూపులు కూడా మారాయి !

-- ఒకప్పుడు కట్టుకునే రాఖీలు ఇప్పుడు ఎక్కువగా కనపడవు ఎక్కడో ఒక్కటి మచ్చుకు మాత్రమే కనిపిస్తాయి, పాత కాలంలో రాఖీలు చాలా పెద్దగా సాంప్రదాయంగా ఉండేవి కానీ ఇప్పుడు అవి తన రూపాన్ని మార్చుకొని updated అయ్యి కొత్త కోణంలో, కొత్త డిజైన్ లో రాఖీలు వస్తున్నాయి. అలాగే పర్యావరణానికి మేలు చేసే రాఖీలు కూడా వచ్చాయి. అలాగే చిన్న పిల్లలకి కార్టూన్ రాఖీలు కూడా వచ్చాయి. బ్రాస్ లైట్ డిజైన్ లో కూడా రాఖీలు వస్తున్నాయి. ఎలా మారినా కూడా వాటిని ఈ పర్వ దినాన అన్నా తమ్ముళ్లు, అక్కా చల్లెళ్ళు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు కూడా సంతోషంగా జరుపుకుంటున్నారు.


* ఈ రాఖీ పండుగ మనకు ఇచ్చే సందేశం:-

 -- రాఖీ పండుగ మనకు అందరికీ ఒక గొప్ప నీతిని నేర్పిస్తుంది. బంధాలు కేవలం మన రక్త సంబంధాలకు మాత్రమే కాదు వాటికే పరిమితం కాదు ప్రేమ, రక్షణ, నమ్మకం,అనే మంచి మంచి విలువలను నేర్పిస్తూ అవి ఏ సంబంధాలని అయినా చాలా పవిత్రంగా ఉండేలాగా చేస్తున్నాయి, మనకి నేర్పిస్తున్నాయి. నేటి మానవులు కూడా ఆ నీతిని విలువలను తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అవి పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే అందరూ ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటూ కష్టాల్లో , బాధలో అండగా ఉంటూ సహాయాన్ని అందించడం మన అందరి మీదా ఉన్న ఒక గొప్ప బాధ్యత అని నేను అనుకుంటున్నా మరి దానికి మీరు ఏం అంటారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.


* ముగింపు సందేశం:-

 -- మన దేశంలో రాఖీ పండుగ అనేది అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెళ్ళు మధ్య ప్రేమ, నమ్మకం, రక్షణ అనే ఈ మూడు స్థంబాలపై నిలిచిన ఒక మహోన్నతమైన పవిత్ర మైన బంధానికి గుర్తు. ఇది మన దేశ ఆచార సాంప్రదాయాలకు, మానవ విలువలను ఇంకా ఎక్కువగా పెంచే పండగే ఈ రాఖీ పండుగ, అందుకే ప్రతీ ఒక్కరు ఈ రాఖీ పండుగ ని ప్రేమగా , ఆప్యాయంగా సంతోషంగా జరుపుకోవాలి అని అందరూ మంచి విలువలతో బ్రతకాలి అని కోరుకుంటున్నా, ధన్యవాదాలు


  Thank you for your reading. 
  

    * మీకు అందరికీ రాఖీ పౌర్ణమి శుభకాంక్షలు*