ధర్మస్థల ప్రాచీన పుణ్యక్షేత్రంలో భయంకరమైన హత్యలు అవ్వీ నిజమేనా మాస్ బరియల్ కేసు, భయంకరమైన నిజాలు, 100 కి పైగా ఆడపిల్లల హత్యలు,

 
Dharmasthala incidents

 
* ధర్మస్థల లో జరిగిన అత్యాచారాల నేపథ్యం:-

-- Dharmasthala (ధర్మస్థల) లో జరిగిన సంఘటనల మీద అత్యంత లోతైన విషయాలను ఇక్కడ మీకు నేను చెప్పబోతున్నాను.

-- ధర్మస్థల  మాస్ బరియల్ కేసు గురించి అక్కడ జరిగిన అత్యాచారాల గురించి తెలుసుకున్న ప్రతీ ఒక్కరు ఇది నమ్మలేక పోతున్నారు. కానీ అదే నిజం. అక్కడ మహిళల మీద చిన్నారుల మీద అత్యాచారాలు మరణాలు వాటి దహనాలు కొన్ని 100 ల సంఖ్యలో ఉంటాయి అని చెప్తున్నారు. అవి వింటే వెన్నులో వణుకు పుట్టే అంత భయంకరంగా జరిగాయి అనిపిస్తుంది.

* మరి ఈ నిజాలు అన్ని ఎలా బయటకు వచ్చాయి, ఎవరు బయట పెట్టారు తెలుసుకుందాం:-

-- ఆ ప్రదేశంలో పారిశుధ్య పని చేసే ఒక వ్యక్తి ఈ విషయాల మీద పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన మొదటి ఫిర్యాదు, గత నెల జూలై 2025 లో ఫిర్యాదు చేశాడు.
అతను 1995 నుండి 2014 వరకు అక్కడే పారిశుధ్య పని చేశాడు అంటా.
-- స్వయంగా అతని చేతులతోనే 100 కి పైగా మహిళలను, చిన్న పిల్లల శవాలను లాక్కొని తీసుకొని వచ్చి పాతి పెట్టాను అని, అవ్వన్నీ నాతో బలవంతంగా చేయించారు అని ఒకవేల నువు చేయకపోతే నిన్ను నీ కుటుంబాన్ని కుడా చంపేస్తామని బెదిరించారు అని అందుకే నేను అలా చేశాను అని, కానీ అధి నన్ను చాలా బాధ పెడుతుంది అని, ఆ సంఘటనలు నన్ను బాధ పెడుతున్నాయి అని అతను చెప్పాడు, ఫస్ట్ వాటిని ఆత్మ హత్యలు అని ఎవరో వాళ్లు దర్మస్తల నీళ్లలో దూకి చనిపోయారు. వెళ్లి వాళ్ళని పూడ్చి పెట్టు అని చెప్పేవారు కానీ అలా ఎప్పటికీ జరుగుతుండేవి అని, చాలా మంది మహిళలు, స్కూల్ యూనిఫాం లో ఉన్న పిల్లలు కూడా చనిపోయారు, మహిళల ఒంటి మీద బట్టలు లేకుండా అలాగే కొట్టి హింసించిన గాయాలు ఉండేవి అవ్వన్నీ చూసి ఒక్కరోజు నేను అడిగాను అని కానీ వాళ్ళు నీకు అవ్వన్నీ అవసరం లేదు మేము చెప్పిన పని నువు చేయు అని ఈ విషయాలు బయట ఎవరికీ అయిన చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని కుడా చంపేస్తామని బెదిరించారు అందుకే నేను అలా చేశాను అని కానీ ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే ఈ భయంకరమైన నిజాలు నాతోనే అంతం అవుతాయి అని, ఆ సంఘటనలు నన్ను చాలా మనోవేదనకు గురి చేస్తున్నాయి అని అవ్వన్నీ విషయాలు అతను చెప్పడం జరిగింది.



* ఫిర్యాదు నమోదు తర్వాత విచారణకు సిద్దం:-

ఈ సంఘటనకు సంబంధించిన మొదటి కేసు జులై 4 న దక్షిణ కన్నడ పోలీస్ స్టేషన్ లో FIR నమోదు కావడం జరిగింది. జూలై 11 తారీకు రోజున ఆ sanitation చేసే వ్యక్తి BNSS section 183 ప్రామాణికంగా అతను ఈ విషయాలు అన్ని కోర్టు లో చెప్పాడు. అవసరం అయితే నేను పాతి పెట్టినా శవాలను ఆ ప్రాంతాన్ని చూపిస్తా తవ్వి చూడండి అని అతను చెప్పాడు. 

-- తర్వాత karnataka లో ఉన్న women's commission దీన్నీ పరిశీలించి , దీని కోసం వెంటనే ప్రభుత్వం "SIT " ఏర్పాటు చేయాలి అని చాలా గట్టిగా డిమాండ్ చేసింది.

* SIT ఏర్పాటు మొదలు అయ్యింది:-

-- కర్ణాటక ప్రభుత్వం దీని మీద జులై 19 న SIT ని ఏర్పాటు చేసింది. దీనికోసం SIT లో pronab mahanthi ని DGP గా నియమించారు. 

-- ఈ SIT బృందం , Pronab mahanthi, M.N Anucheth, jithendra dayama, S.K Soumyalatha, వీళ్ళని ఏర్పాటు చేసింది.

* SIT బృందం విచారణ కోసం వెతుకులాట:-

-- దీని కోసం అంతర్గత భద్రతా మరియు విచారణ నిపుణులు కలిసి మొత్తం 15 burial sites ని గుర్తించడం జరిగింది. 

-- నేత్రవతి నది ఒడ్డున , హైవే పక్కన, ఇంకా కొన్ని మిగతా ప్రదేశాలలో చూడటం జరిగింది.
మొదటి రోజు 5 సైట్లలో చూడటం జరిగింది కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
-- మూడవ రోజు 6 వ సైట్ లో partial skeletal remains అయితే దొరికాయి. తర్వాత జెసిబి తో 4 అడుగుల లోతు కోణం తీసుకొని తవ్వారు . 
-- 5 వ రోజు 9 మరియు 10 వ సైట్స్ లో కూడా తవ్వారు కానీ ఏం దొరకలేదు 
-- అయితే కర్నాటక లో భారీ వర్షాలు పడుతున్నాయి దాని వల్ల తవ్వకాలు ఆగిపోయాయి తవ్వినవి కూడా వెతకడానికి ఇబ్బందిగా ఉండడంతో అక్కడ ఏం దొరకలేదు.

-- 6వ రోజు 11 వ సైట్ లో కొత్తగా suspected remains recovered కావడం జరిగింది. Verification కోసం ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగింది.
-- 6 వ సైట్ లో దొరికిన వాటిని forensic ప్రాసెస్ కోసం ఆ ఎముకలను లాబ్ కి పంపించడం జరిగింది.
-- వాటిని DNA పరీక్ష ద్వారా ఆ విక్టిమ్ జెండర్, వయసు ఎలా చనిపోయారు అని ప్రస్తుతం తెలుసుకుంటున్నారు.

-- అదేవిధంగా ఇప్పుడు ananya Bhat తో సహా మిగతా స్టూడెంట్స్ కి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఫోకస్ అవుతున్నాయి.

* ప్రజల యొక్క స్పందన అలాగే సామాజిక ఒత్తిడి ఎలా ఉంది:-
-- All India democratic women's association (AIDWA) కి సంబంధించిన వాళ్లు సౌజన్య, వేదవల్లి, యమున, పద్మలత వీళ్లకు సంబంధించిన కేసులను మళ్ళీ అన్వేషించి విచారణ చేయాలి అని చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

-- SIT దర్యాప్తు జాగ్రత్తగా జరగాలి అని , వాళ్ళకి పూర్తిగా autonomy ఇవ్వాలని హెచ్చరించారు. ఎవరు ఎన్ని చేసినా కూడా టెంపుల్ యాజమాన్యాలు చేసిన కూడా దర్యాప్తు transparency గా జరగాలి అని కోరుకున్నారు.

-- 2013 వ సంవత్సరం వరకు దగ్గర దగ్గర 462 మంది Unnatural గా చనిపోయారు అని public records లో ఉన్నాయి.

--  మిగతా సైట్స్ ని future steps ground penetrating Radar (GPR) అనే పరికరాన్ని ఉపయోగించి వెతకాలి అని సూచించారు.

-- పాత లొకేషన్స్ change కావడం వల్ల అలాగే మట్టి కూడా change కావడం వల్ల landmarks కొంత మేరకు మారిపోయాయి.
-- SIT బృందం యొక్క investigation పూర్తి అయ్యాక  దానికి సంబదించిన పూర్తి report Karnataka government కి అందచేస్తారు. దాని తర్వాత ఆ government decision తీసుకోనుంది.

*  ఈ విషయం మీద మీరు ఏం అనుకుంటున్నారు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలాంటి మంచి విషయాల కోసం డైలీ మన website ని follow అవ్వండి www.trendtelugu.world  ఇంకా ఈ విషయాన్ని మీ friends కి కూడా షేర్ చేయండి.
   Thank you for your Reading...



   

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు