* పరిచయం:- hepatitis D (హెపటైటిస్ D) అంటే ఏంటి?
-- హెపటైటిస్ D ని HDV అంటారు. HDV అంటే hepatitis D virus. లేదా దీనినే డెల్టా వైరస్ అని కూడా అంటారు. ఇది ఒక అరుదైన liver viral infection.
-- దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది హెపటైటిస్ B అనే వైరస్ ఇప్పటికే ఉన్నవారికి సోకుతుంది. ఒకవేళ ఎవరిైనా ఒక వ్యక్తికి hepatitis B virus లేకపోతే వాళ్ళకి hepatitis D virus రావడం అనేది చాలా తక్కువ.
-- హెపటైటిస్ D ను HDV (Hepatitis D Virus) లేదా డెల్టా వైరస్ అని కూడా అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన లివర్ వైరల్ ఇన్ఫెక్షన్.
* ఇది మన లివర్ ని ఎలా infect చేస్తుంది?
-- మన లివర్ నీ HDV infect చేస్తుంది. లివర్ ఇన్ఫెక్ట్ కావడం వల్ల లివర్ లోని కణాలు నశించి పోతాయి, లివర్ కి గాయాలు ఏర్పడతాయి. అలాగే కొనసాగితే చివరికి లివర్ సిరోసిస్ మరియు క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
* Hepatitis D ఎలా వ్యాపిస్తుంది ?
-- ఈ హెపటైటిస్ D అనే వైరస్ మన శరీరంలో ఉండే రక్తం అలాగే శరీర ద్రవాల ద్వారా మన శరీరం అంతటా వ్యాపిస్తుంది.
* ఈ వైరస్ వ్యాపించే మార్గాలు:-
1, ఇంజెక్షన్లు ద్వారా :-
-- injections ద్వారా ఇది వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
2, సురక్షితం కాని రక్తాన్ని మార్చుకోవడం
-- రక్త మార్పిడి జరిగేటప్పుడు అధి మంచి రక్తమా లేదా చెడు రక్తామా అని అన్నీ టెస్టులు చేసి నిర్థారించుకున్న తర్వాత అవసరం అయితే వాడాలి.
3, ప్రమాదకరమైన లైంగిక సంబంధాలు:-
-- ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇలాంటివి పనికిమాలిన పనులు చాలా జరుగుతున్నాయి వాటి వల్ల భయంకరమైన రోగాలు వస్తాయి. అందులో ఈ వైరస్ కూడా ఒకటి కాబట్టి జీవితాలు నాశనం చేసుకోకండి. విలువలతో, ఎథిక్స్ తో బ్రతకండి.
4, శరీరం మీద టాటూ లు వేసుకోవడం అలాగే పియర్సింగ్ టైమ్ లో infected సూదులు వాడడం:-
-- ఇప్పుడు ఉన్న యువత కి టాటూ లు అనేవి ఒక ఫ్యాషన్ అయిపోయింది, కానీ వాటి వల్ల కూడా ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది.
5, గర్భంలో ఉన్న సమయంలో తల్లి నుండి బిడ్డకు వచ్చే అవకాశం కూడా ఉంది:-
-- కచ్చితంగా తల్లి మొదటి నుండి చాలా జాగ్రతగా అన్నీ టెస్టులు చేపించుకొని డాక్టర్ ఇచ్చిన సూచనల మేరకు నడుచుకోవాలి.
* ఈ హెపటైటిస్ D వ్యాధి యొక్క లక్షణాలు:-
-- ఈ వ్యాధి మొదట్లో చాలా మంది కి ఎక్కువగా ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించక పోవచ్చు, ఒకవేళ లక్షణాలు కనిపిస్తే అవి ఎలా ఉంటాయి ?
1, జ్వరం
2, బలహీనత మరియు అలసట
3, ఆకలి తగ్గిపోవటం
4, చర్మం అలాగే కళ్లపై పసుపు రంగు కనిపించడం
5, కడుపు నొప్పి రావడం
6, మానసిక గందరగోళం
7, పొట్ట ఉబ్బరంగా ఉండటం
8, రక్తస్రావం జరగడం
9, వాంతులు, మరియు మలబద్దకం
10, లివర్ సిరోసిస్
* క్యాన్సర్ కి మరియు హెపటైటిస్ D కి అసలు సంబంధం ఎంటి ?
-- హెపటైటిస్ D వైరస్ రావడం వల్ల దీర్ఘకాలం ఇది లివర్ మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది. దాని వల్ల లివర్ లో ఉండే కణాలు ఎప్పటికీ దెబ్బ తింటాయి మళ్ళీ పెరుగుతాయి. కాని ఈ ప్రక్రియలో DNA లో చాలా మార్పులు వచ్చి లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. (Hepatocellular carcinoma)
* ఈ వ్యాధి వచ్చే పమాధం ఉన్నవారు ఎవరు ?
1, liver సిరోసిస్ ఉన్నవారు
2, హెపటైటిస్ B+D ఇన్ఫెక్షన్లు ఉన్నవారు
3, ఆల్కహాల్, మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారు.
4, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు.
ఇలాంటి వారికి ఎక్కువగా ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి కొవ్వు పట్టిన లివర్ ని శుద్ది చేసుకోవడం ఎలా? ఈ పళ్ళు తింటే క్లీన్ అవుతుంది.
* మరి ఈ హెపటైటిస్ D వ్యాధిని గుర్తించడం ఎలా?
-- బ్లడ్ టెస్ట్ ల ద్వారా డాక్టర్స్ ఈ హెపటైటిస్ D వ్యాధిని గుర్తిస్తారు.
1, Anti -HDV , Antibodies:-
-- మన శరీరం వైరస్ కి వ్యతిరేకంగా తయారు చేసిన antibodiies ని గుర్తిస్తుంది.
2, HDV RNA టెస్ట్:-
-- ఈ టెస్ట్ వైరస్ జెనెటిక్ మెటీరియల్ ఉందా అని చెపుతుంది దాని ద్వారా తెలుసుకోవచ్చు.
3, ఆల్ట్రాసౌండ్ మరియు MRI స్కాన్:-
-- మన లివర్ లో ఏమైనా గాయాలు ఉన్నాయా, ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా లేదా సిరోసిస్ ఉందా అని వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
4, లివర్ ఫంక్షన్ టెస్ట్:-
-- ఈ టెస్ట్ చేయడం వల్ల మన శరీరంలో మన లివర్ సరిగా పని చేస్తుందా లేదా అని తెలుస్తుంది.
* Hepatitis D వైరస్ కి నివారణ చర్యలు:-
-- ఈ వైరస్ కి ప్రత్యేకంగా వ్యాక్సిన్ అంటూ ఏం లేదు .
-- హెపటైటిస్ B కి ఉపయోగించే వ్యాక్సిన్ నే వాడుతారు, దాని వల్ల హెపటైటిస్ D వైరస్ వచ్చే ప్రమాదాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ పైన చెప్పిన విధంగా ఇంజెక్షన్లు, రక్త మార్పిడి, లైంగిక సంంధాలు ఎలాంటి వాటికి దూరంగా ఉంటూ తగిన టెస్టుల ద్వారా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి.
*ఈ hepatitis D వ్యాధికి చికిత్స ఏంటి?
-- ఈ వ్యాధికి ప్రస్తుతం 100% work అయ్యే మందులు లేవు, కాకపోతే కొన్ని మందులు ఈ వైరస్ నీ పెరగకుండా తగ్గించగలవు అని డాక్టర్స్ చెప్తున్నారు.
-- ఇంకోటి పెగిలేటేడ్ ఇంటర్ ఫెరాన్ ఇది ఒక దీర్ఘకాల చికిత్స ఇది 48 వారాల వరకు ఉంటుంది.
-- లివర్ ట్రాన్స్ ప్లాంట్ , చివరి దశ లివర్ ఫెయిల్యూర్ అయిన సందర్భంలో వాడుతారు.
-- వీటితో పాటు డాక్టర్స్ లివర్ నీ ఎలా కాపాడుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, జీవనశైలి ఎలా ఉండాలి అని అన్నీ చెప్తారు వాటి ప్రకారం నడుచుకోవాలి.
* చివరగా కొన్ని మాటలు:-
-- hepatitis D అనేది ఒక భయంకరమైన లివర్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి కేవలం hepatitis B ఉన్న వారిలో మాత్రమే వస్తుంది.
-- ఇది ఎక్కువ కాలం ఉంటే లివర్ సిరోసిస్ అలాగే లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
-- వీటితో పాటు హెపటైటిస్ B వ్యాక్సిన్ తీసుకొని మంచి జీవనశైలిని అలవర్చుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి.
ఇప్పటివరకు చదివినందుకు ధన్యవాదాలు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన website ని follow అవ్వండి. ఈ విషయాన్ని మీ friends కి share చేయండి. Thank you.
0 కామెంట్‌లు