Tuvalu దేశం పసిఫిక్ మహాసముద్రం లో మునుగుతుంది, అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఎంటి

 

 
Tuvalu country situation

* Tuvalu దేశం యొక్క పరిచయం:-

  -- Tuvalu దేశం అనేది ఒక ద్వీప దేశం అంటే చుట్టూ సముద్రం ఉండి మధ్యలో దేశం ఉంటే ఆ దేశాన్ని ద్వీప దేశం అంటారు. 
  -- మరి ఆ దేశ పరిస్థితులు, అక్కడ ఉన్న సమస్యలు, అలాగే ఫ్యూచర్ లో వాళ్ళకి రాబోయే ప్రమాదాలు ఏంటి? 

అవ్వన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.


*-- Tuvalu దేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం అయిన పసిఫిక్ మహాసముద్రం లో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం.

 * జనాభా:- 

   Tuvalu దేశంలో జనాభా చాలా తక్కువగా ఉంటారు. ఆ దేశ జనాభా మొత్తం కలిపి కేవలం 11,000 మాత్రమే ఉంది.


* ఆ దేశం యొక్క రాజధాని:- ఫునాఫుటి.


* భాషలు:-

 -- Tuvalu దేశంలో నివసిస్తున్న ప్రజలు మాట్లాడే ప్రధాన భాషలు 1, టువాలువన్  2, ఇంగ్లీష్. ఈ భాషలను ఎక్కువగా మాట్లాడుతారు.

* వీళ్ళ ప్రధాన ఆదాయం:-

-- ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా చేపలను వేటాడటం, అలాగే విదేశీ సహాయం, వీటితో పాటు టీవీ, ఇంటర్నెట్ డొమైన్ అద్దె ఇలాంటి పనులు చేసుకుంటూ వారి యొక్క జీవనాన్ని గడుపుతారు అదే వారి యొక్క ప్రధాన ఆదాయ వనరు.


* Tuvalu దేశం ఎంత పెద్దగా ఉంటుంది:-

-- ప్రపంచంలో అతి చిన్న దేశాలలో Tuvalu దేశం కూడా ఒకటి. ఈ దేశం భౌగోళికంగా చాలా తక్కువగా కొన్ని మీటర్ల ఎత్తులోనే సముద్ర మట్టం మీద ఉంటుంది. దాని వల్ల చాలా వాతావరణ మార్పులు వస్తాయి, అవి ఈ దేశానికి భయంకరమైన సమస్యగా మారాయి. 

 
Climate change in Tuvalu country


* అసలు ఈ దేశం సమస్య ఏంటి?

-- Tuvalu దేశంలో ఉన్న సమస్యలలో ప్రధానమైన సమస్య ఏంటి అంటే అక్కడ ఉన్న పసిఫిక్ మహాసముద్ర మట్టం పెరగడం.
-- ప్రపంచ గ్లోబల్ వార్మింగ్ వలన అక్కడ ఉన్న మంచు గడ్డలు జరుగుతూ వస్తున్నాయి.
-- మంచు గడ్డలు జరగడం వల్ల పసిఫిక్ మహాసముద్రం లో నీటి మట్టం ప్రతీ సంవత్సరం దాదాపుగా 4 నుండి 5 మిల్లీ మీటర్లు నీటి మట్టం పెరుగుతుంది.

ఇది కూడా చదవండి జపాన్ లో భూకంపం.

* ఈ దేశం ఎంత ఎత్తులో ఉంటుంది:-

-- Tuvalu ద్వీప దేశం సగటున 2 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాని వల్ల అలాగే మంచు గడ్డలు కరగడం వల్ల ఒకవేళ సముద్ర మట్టం పెరిగితే, Tuvalu దేశం మొత్తం పసిఫిక్ మహాసముద్రం లో మునిగి పోతుంది. అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా చనిపోతారు.


* ఈ దేశం యొక్క పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుంది:-

1, ఆ దేశంలో ఉన్న తీర ప్రాంతాలు ముందుగా నాశనం అవుతాయి. అలల తాకిడికి ఆ తీర ప్రాంత భూమి తెగిపోతుంది. దాని వల్ల తీర ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతారు.

2, వ్యవసాయం నష్టం:-

-- ఆ దేశంలో ఉన్న సముద్ర జలాల వల్ల ఆ భూములు ఉప్పుగా మారిపోయి పంటలు పండకపోవడం జరుగుతుంది. దీని వల్ల వ్యవసాయం అనేది నష్టపోతుంది.

3, మంచినీటి కొరత ఏర్పడటం:- 

-- ఆ దేశంలో ఉన్న సముద్ర జలాలు అక్కడ ఉన్న భూగర్భ జలాలలో కలిసి పోవడం వల్ల, త్రాగు నీరు మంచి నీరు మొత్తం ఉప్పుగా మారి తాగడానికి పనికి రాకుండా పోతాయి.


4, ఈ దేశంలో వరదలు, తుఫాన్ల ప్రభావం ఎలా ఉంటుంది:- 

-- ఈ దేశంలో వరదలు, తుఫాన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ దేశంలో ఉన్న రహదారులు, ఇళ్లు చాలా వరకు దెబ్బ తింటున్నాయి.

Tuvalu country people situation

 
*వీటి వల్ల ఆ దేశ ప్రజల జీవన విధానం పై ఎలాంటి ప్రభావం పడుతుంది:-
-- ఆ దేశ ప్రజలు విద్య, ఉద్యోగం అలాగే ఆరోగ్య సేవలకోసం అవ్వన్నీ అక్కడ దొరకక చాలా మంది ప్రజలు దేశం విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు.
-- చాలా మంది ప్రజలు ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు.

-- పాపం ఇప్పటికే Tuvalu దేశం వాతావరణ శరణార్థుల హోదా కోసం అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ బాధను చెప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.


* Tuvalu దేశంలో ప్రస్తుతం తాజా సంఘటనలు, చర్యలు ఎలా ఉన్నాయి?


-- Tuvalu దేశ ప్రధాని సీమౌ కౌకా 2022 లో అంతర్జాతీయ సదస్సులో అతను నీటిలో నిలబడి మాట్లాడటం జరిగింది. అంటే అతను వాళ్ళ దేశ పరిస్థితి అలా ఉంది అని సముద్ర మట్టం పెరగుతుంది అని ఆ సమస్య ప్రపంచ దేశాల కి కూడా problem అవుతోంది అని, ప్రపంచానికి తెలిసేలా అతను నీటిలో నిలబడి మాట్లాడటం జరిగింది. అప్పుడు అధి ప్రపంచం మొత్తం తెలిసింది.


-- తర్వాత 2023- 2024 మధ్య కాలంలో ఆస్ట్రేలియా దేశంతో ఒక ప్రత్యేకమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం Tuvalu దేశ ప్రజలకు భవిష్యత్తులో ఆస్ట్రేలియా లో స్థిరపడే అవకాశం హక్కు కల్పించబడుతుంది.

-- Tuvalu దేశం ఒక డిజిటల్ దేశంగా అవతరించాలని నిర్ణయించుకుంది. అంటే Tuvalu దేశం భవిష్యత్తులో సముద్రం లో మునిగిపోయిన కూడా డిజిటల్ గా Tuvalu దేశం యొక్క రాజకీయ హక్కులు, సాంస్కృతిక హక్కులు అలాగే కొనసాగుతాయి అన్న మాట.


* ఈ దేశంలో భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలు:-


-- Tuvalu దేశం 2100 సంవత్సరం నాటికి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందంట.

-- అలా జరిగితే గనుక Tuvalu దేశ ప్రజలు వాళ్ళ సొంత దేశాన్ని పూర్తిగా శాశ్వతంగా కోల్పోతారు.

-- భాష, వారసత్వం, సాంస్కృతిక సాంప్రదాయాలు ఎలా వాళ్ళ దేశానికి సంబంధించిన అన్నీ ఆనవాళ్లు కోల్పోతారు.


* Tuvalu దేశం ప్రపంచ దేశాల కి ఇచ్చే సందేశం ఏంటి?

-- Tuvalu దేశం యొక్క పరిస్థితి కేవలం ఆ ఒక్క దేశం సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సమస్య అలాగే అన్నీ దేశాలకి ఇది ఒక హెచ్చరిక కూడా అవుతుంది.

-- ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులను అదుపుచేయకపోతే పసిఫిక్ మహాసముద్రం లో ఉన్న ద్వీప దేశాలు మాత్రమే కాదు, భూమికి తక్కువ ఎత్తులో ఉన్న అన్ని ప్రాంతాలకు ఇలాంటి ప్రమాదమే వస్తుంది.

-- దీనికోసం అంతర్జాతీయ సహకారం అలాగే పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం చేయకుండా, పునరుత్పత్తి శక్తి వినియోగం పెరగాలి. అప్పుడే గ్లోబల్ వార్మింగ్ అదుపులో ఉంటుంది.


* ముగింపు మాటలు:-

-- Tuvalu దేశం ఒక అందమైన అద్భుతమైన సుందరమైన ద్వీప దేశం. కాని వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో అక్కడ అసలు భూమి అనేదే లేకుండా పోయే ప్రమాదం వచ్చింది. ఆ దేశంలో వచ్చిన సమస్య ఇప్పుడు ప్రపంచ అన్నీ దేశాలకి ఒక సమస్యని గుర్తు చేస్తుంది. అది ఏంటి అంటే వాతావరణాన్ని సురక్షితంగా కాపాడాలి , కాలుష్యాన్ని తగ్గించాలి , గ్లోబల్ వార్మింగ్ అదుపులో ఉంచుకోవాలి అందుకు ప్రపంచ ప్రజలు అందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలను కాపాడుకోవాలి, వాతావరణాన్ని సురక్షితంగా కాపాడాలి అధి ప్రపంచ ప్రజల అందరి బాధ్యత మరి మీరు ఏం అంటారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.

ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన website ని daily follow అవ్వండి, మీ friends కి కూడా ఇది share చేయండి. ధన్యవాదాలు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు