* ఇది ఒక చారిత్రాత్మక తీర్పు వివరాలు తెలుసుకుందాం:-
-- అతను ఓ మాజీ ప్రధాని మనవడు ఇది రాజకీయాల్లో సంచలనంగా మారిన ఒక అద్భుతమైన తీర్పు. ఒకప్పుడు హాసన్ అనే ప్రాంతం నుండి ఎంపీ గా గెలిచిన ఒక వ్యక్తి అతనే prajval Revanna. అతను చేసిన దారుణమైన పనులు ఇప్పుడు అతని జీవితాన్నే మార్చేసింది. జీవితకాలం ఖైదీగా జైల్లో ఉండేలాగా చేసింది. అందుకే నేను ఎప్పుడూ అందరికీ చెప్తూ ఉంటా మనం చేసే చెడ్డ పనులు ఎవరికీ తెలియదు అనుకుంటాం, ఎవరూ చూస్థలేరు కదా చేస్తే ఏం అవుతుంది అనుకుంటాం, డబ్బు , అధికారం, భలం, అందం, ఐశ్వర్యం ఉన్నాయి అన్న పొగరుతో కూడా కొంత మంది ఇష్టం ఉన్నట్లుగా బ్రతుకుతారు హేయ్ ఏం అవుతుంది అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరికీ వాళ్లు చేసిన దారుణమైన పనులకు కాలం కచ్చితంగా సమాధానం చెప్తుంది దాని ఫలితం అనుభవిస్తాము కొంచెం ముందు కొంచెం వెనుక అంతే కానీ కచ్చితంగా ఫలితం మాత్రం అనుభవిస్తాం కాబట్టి ప్రతీ ఒక్కరు కూడా జీవితంలో ఆలోచించి ఆచి తూచి అడుగులు వేయాలి నీతిగా నిజాయితీగా ధర్మంగా బ్రతకాలి కచ్చితంగా ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని నేను అందరికీ చెప్తూ ఉంటా కానీ అది ఎవరూ పట్టించుకోరు ఇష్టం ఉన్నట్లుగా బ్రతుకుతారు చెడ్డ పనులు చేస్తారు చివరకి అధి బయట పడ్డాక ఏడుస్తారు చచ్చిపోతారు, అందుకే ఎది అయినా కూడా ముందే ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి నీతిగా నిజాయితీగా ధర్మంగా బ్రతకాలి లేదంటే ఇలాగే ఈ వ్యక్తికి పడ్డట్లే ఎదో ఒక రోజు ఎదో ఒక రూపంలో చెడ్డ వాళ్ళ అందరి మీదికి భయంకరమైన ప్రమాదాలు వస్తాయి మన లైఫ్ లేకుండా చేస్తాయి గుర్తు పెట్టుకోండి. ఇకపోతే ఈ మాటర్ లోకి వెళ్దాం...
* మాజీ ప్రధానికి ఇతను మనవడు:- కోర్టు తీర్పు.
-- ఇతను మాజీ ప్రధానమంత్రి H.D దేవెగౌడ కి మనవడు ఈ Prajval Revanna, ఇతని పై చాలా అత్యాచార ఆరోపణలు వచ్చాయి. దాని వల్ల అతనికి రాజకీయంగా అలాగే సామాజికంగా కూడా అతని జీవితానికి తలుపులు మూసుకున్నాయి. ఈ సంఘటన 2, ఆగస్టు, 2025 రోజున బెంగళూరులో ఉన్న elacted repragentative special court ప్రజ్వల్ రేవన్న కి యావజ్జీవ కారాగార శిక్ష ని విధించడం జరిగింది.
* అసలు ఈ prajval Revanna అంటే ఎవరు అతను చేసిన తప్పు ఏంటి తెలుసుకుందాం...
-- ప్రజ్వల్ రెవన్న అనే ఈ వ్యక్తి హాసన్ అనే ప్రాంతం నుండి ఎంపీ గా గెలిచిన వ్యక్తి, ఇతని తండ్రి పేరు H.D revanna అతను JDS పార్టీ నాయకుడు, అలాగే ఇతని తాత పేరు H.D దేవెగౌడ ఇతను మాజీ ప్రధానమంత్రి.
-- prajval Revanna 2019 సంవత్సరంలో హసన్ అనే లోక్ సభ నియోజకవర్గం నుండి MP గా ఎన్నుకోబడిన వ్యక్తి. ఇతను తన కుటుంబ రాజకీయాల పరంపరలో రాజకీయంగా ఎదిగాడు. కాని ఇప్పుడు అతని మీద వచ్చిన ఆడపిల్లల మీద అత్యాచారాల ఆరోపణలు జాతీయ స్థాయిలో చర్చగా మారాయి . దీంతో అతని రాజకీయ జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితం కూడా క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది.
* అసలు ఈ కేసు ఎలా బయటపడిందో తెలుసుకుందాం:-
-- అది 2024 వ సంవత్సరం ఏప్రిల్ నెలలో రాగకియంగా హాసన్ జిల్లాలో టెన్షన్ వాతావరణంలో ఆ గందరగోళంలో ఒక pendrive ద్వారా లీకైన అమ్మాయిల మీద బలవంతంగా రేప్ చేస్తున్న వీడియోలు సంచలనంగా మారాయి. అందులో బాధితురాలు గృహంలో పని చేసే ఒక పని అమ్మాయి. ఆమె అతను చేసిన దారుణమైన అమానుష విషయాలను దాడులను బయట పెట్టింది. ఆ వీడియోలు మానవ హక్కుల సంఘాలకి అదే విదంగా మహిళ సంఘాల దగ్గరకి వెళ్లాయి దాంతో ఈ కేసు చాలా పెద్దది అయ్యింది.
* (SIT) Special investigation team ని విచారణకు ప్రవేశం:-
--- తర్వాత అక్కడ ఉన్న కర్ణాటక ప్రభుత్వం ఈ కేసు చాలా తీవ్రంగా ఉంది అని గమనించి special investigation team (SIT) ని విచారణ కోసం నియమించడం జరిగింది.
-- తర్వాత SIT విచారణ జరిపి 1600 పేజీల ప్రాథమిక ఛార్జ్ షీట్ ని ఇవ్వడం జరిగింది. మళ్లీ తర్వాత 2000 పేజీల వేరే ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత DNA పరీక్షలు నిర్వహించి, విడియో ఫోరెన్సిక్ విశ్లేషణ జరిగించి అన్ని విషయాలు తెలుసుకొని, ఆ బాధితురాలు, అలాగే వంట మనిషి డ్రైవర్ తో సహా 26 మంది సాక్షాలు తీసుకొని అవ్వన్నీ సమర్పించి అతను చేసిన నేరం నిజమే అని చెప్పడం జరిగింది. అలాగే DNA and forensic information తో Prajval Revanna మీద 30 కి పైగా సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి.
* తర్వాత prajval ఎవరికీ తెలియకుండా విదేశాలకి పారిపోవడం అరెస్టు అవ్వడం గురించి తెలుసుకుందాం:-
-- అతను చేసిన దారుణమైన పనులు వీడియోలు బయటికి రావడంతో మెల్లిగా diplomatic passport ద్వారా జర్మనీకి పారిపోయాడు, అధి తెలిసిన ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యారు. తర్వాత సెంట్రల్ government ఒత్తిడి అలాగే కోర్టు పంపిన నోటీసులతో 31, మే, 2024 న మళ్ళీ ఇండియా కి తిరిగి వచ్చాడు. ఆ వచ్చే క్రమంలో బెంగళూర్ విమానాశ్రయంలో పోలీస్ లు prajval Revanna ని అరెస్ట్ చేశారు.
* తర్వాత కోర్టు లో తీర్పు ఎలా వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాం:-
-- 31, జూలై, 2025 రోజున బెంగళూరు లోని elected representatives court అతను నేరం చేశాడు అని ప్రకటించింది. ఆగస్ట్ 2 న కోర్టు తీర్పు ప్రకటించింది. ఈ తీర్పును న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఇచ్చాడు. ఆ తీర్పు లో ఇలా చెప్పారు,
-- ప్రజ్వల్ రేవాన్న కి జీవిత ఖైదు కారాగార శిక్ష విధించారు.
-- ₹10 లక్షల రూపాయలు జరిమానా విధించారు, అందులో ₹7 లక్షలు బాధితురాలికి, ₹3 లక్షలు మహిళా షెల్టర్ హొమ్ లకు ఇవ్వాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
-- తర్వాత అతనికి ఐపీసీ 376 (బలాత్కారం), అలాగే 354C (వాయుర్యం), వీటితో పాటు 506 (బెదిరింపు), IT చట్టంలోని సెక్షన్ల ప్రకారం కేసులు దాఖలాలు చేసి తీర్పు ఇచ్చింది.
* ఇలాంటి తీర్పు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి:-
-- ఇలాంటి తీర్పు మన భారత దేశ చరిత్రలో ఇదే మొదటసారి. భారత దేశానికి ప్రధానమంత్రి గా పని చేసిన వ్యక్తి యొక్క మనవడికి ఇలాంటి తీర్పు ఇచ్చి శిక్ష వేయడం అనేది న్యాయం ఇంకా బ్రతికే ఉంది అనడానికి ఒక నిదర్శనం మరియు ఈ తీర్పు ఒక అద్భుతమైన చారిత్రాత్మక మైన తీర్పుగా నిలబడి పోతుంది. డబ్బు ఉంది అని అధికారం భలం ఉంది అని అమాయకుల ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తే చట్టం ఊరుకోదు అని అలాగే ఆ దేవుడు కూడా విడిచి పెట్టడు అని మనుషులకి అందరికీ అర్థం కావాలి అన్నట్లుగా ఈ తీర్పు రావడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు.
* తీర్పు తర్వాత Prajval Revanna జైలు జీవితం ఎలా ఉంటుంది అంటే ?
-- Prajval వేసుకునే చొక్కా మీద ఖైదీ నంబర్ 15528 గా కేటాయించడం జరిగింది.
-- ప్రస్తుతానికి ఇప్పుడు అతన్ని బెంగళూరు లోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో పెట్టడం జరిగింది.
-- అతను జైల్ కి వెళ్ళిన మొదటి రోజు మానసికంగా కుంగిపోయి , ఏడ్వడం వంటి సంఘటనలు జరిగాయి అని అధికారులు చెప్పారు.
*అతను ఏడ్వడం మీద నా ఒపీనియన్:-
-- ఏడ్వడం కాదు ఇంకా అంతకంటే ఎక్కువగా టార్చర్ చేయాలి అతన్ని లేకపోతే మరి ఎంత మంది ఆడపిల్లలని వాళ్ళ జీవితాలని నాశనం చేసినప్పుడు అలాంటి చెడ్డ ఆలోచనలు వచ్చేటప్పుడు ఎడ్వాలి మరి నేను ఇట్లా చేస్తే ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు అని చెడ్డ పనులు చేయకముందే ఆలోచించుకోవాలి అవ్వన్నీ, పాపం అమాయక పేద ఆడబిడ్డల మీద రాక్షశంగా చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అయినా ఆలోచించి ఉంటే నీకు కూడా అమ్మ,అక్క,చెల్లి,బార్య,కూతురు ఇలాంటివి జరిగితే ఎంటి పరిస్థితి ఇలా చేయడం తప్పు పాపం ఆ చట్టం అలాగే దేవుడు నన్ను క్షమించరు నేను ఇలా చేస్తే అని అతను ఒక్కసారి అలోచిస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదు, అందుకే ఇప్పటికీ అయిన మిగతా వారు అందరూ కూడా ఈ తీర్పు నీ ఈ సంఘటనను చూసి బుద్ది తెచ్చుకొని పశువుల లాగా కాకుండా విలువలతో కూడిన మంచి మనుషులుగా బ్రతకాలి అని నేను కోరుకుంటున్నా. మీరు ఏం అనుకుంటున్నారు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.
* ఇంకా ఇతని మీద పెండింగ్ కేసులు కూడా ఉన్నాయి:-
-- ఈ ఒక్క కేసు మాత్రమే కాదు ప్రజ్వల్ పై ఇంకా ముగ్గురు మహిళలు .
-- అలాగే జిల్లా పంచాయితీ సభ్యురాలు మీద,
-- ఇంట్లో పని చేసే వంటమనిషి మీద,
-- ఇంకా ఇతర మహిళా కార్య కర్తల మీద
-- ఇలా వాళ్ల మీద బలాత్కారం బెదిరింపు కేసులతో అతని మీద పోలీసు లకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులు ఇంకా విచారణలోనే ఉన్నాయి.
* ఈ తీర్పు పై ప్రజల స్పందన ఎలా ఉంది ?
-- ఈ తీర్పు పై ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఇది ఒక న్యాయ చట్టంలో విజయం గా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు ద్వారా న్యాయ వ్యవస్థ పై విశ్వాసం పెరిగింది అని చెప్పుకోవచ్చు. రాజకీయ బలం ఉన్నవాళ్ళకి చట్టం బాగా బుద్ది చెప్పింది అని హర్షం వ్యక్తమవుతోంది. మహిళల మీద ఆడ పిల్లల మీద కిరాతకంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు అన్న సందేశం బలంగా వినిపిస్తోంది.
-- దీని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ information ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మంచి విషయాల కోసం డైలీ మన TrendTelugu.world అనే website ని follow అవ్వండి thank you for your reading.
0 కామెంట్‌లు