అవతార్ 3: fire and Ash సినిమా ఎలా ఉంది, expectations నీ రీచ్ అయ్యిందా లేదా ఈ review లో క్లారిటీగా తెలుసుకుందాం.
బారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన అవతార్ 3 fire and Ash మూవీ ఎలా ఉంది అంటే ఇది జేమ్స్ కామెరూన్ తన క్రియేటివిటీతో సృష్టించిన ఒక కొత్త ప్రపంచం లాగా ఉండే పాండోర ప్రపంచాన్ని మరొకసారి ఒక కొత్త కోణంలో చూపించడం జరిగింది. అవతార్ 2009 వ సంవత్సరంలో రిలీజ్ అయ్యింది, అవతార్: the way of water 2022 లో రిలీజ్ అయ్యింది, ఇప్పుడు 2025 లో అవతార్ 3 fire and Ash రిలీజ్ అయ్యింది, ఈ సినిమా లో విజువల్స్ అదిరిపోయింది. అలాగే కథ కూడా చాలా బాగుంది, ఎమోషన్స్ ఎక్కువగా వర్కౌట్ అయ్యింది, మనల్ని ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి.
అసలు ఈ సినిమాకి fire and Ash అని ఎందుకు పెట్టారు తెలుసుకుందాం:-
ఈ మూడవ భాగంలో పాండోర గ్రహం మీద శాంతియుతమైన వాతావరణం అనేది కనపడదు, కథ మొత్తం కూడా విధ్వంసం, ప్రతీకారం, కోపం అలాగే పునర్జన్మ అనే భావాల చుట్టూ తిరుగుతుంది, ఇప్పటివరకు మనం చూసిన అవతార్ రెండు మూవీస్ లో ప్రకృతి ఆధారమైన జీవనాన్ని గడిపేవారు కానీ ఈ సినిమా లో దానికి బిన్నంగా అగ్ని ఆధారిత తెగ నీ చూపించి దాని ద్వారా నావీ ప్రపంచంలో ఉన్న ఒక చీకటి కోణాన్ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుతంగా చూపించాడు. ఈ కథలో కేవలం పాండోర గ్రహంలో ఉన్న వాళ్ళకి అలాగే భూమి మీద ఉన్న మనుషులు శత్రువులు గా ఉండేవారు కానీ ఈ సినిమా లో అదే పాండోర గ్రహంలో నివశిస్తున్న కొంత మంది లో ఉన్న విబేధాలే వాళ్లలో వాళ్ళకే ఘర్షణలు పుట్టిస్తాయి. అందుకే ఈ సినిమాకి fire and Ash అని ట్యాగ్ పెట్టడం జరిగింది అని నాకు అనిపించింది.
ఈ సినిమా లో జాక్ పాత్ర ఎలా ఉంది ?
జాక్ పాత్ర ఇంతకముందు అవతార్ రెండు మూవీస్ లో పోరాట యోధుడు గా నాయకుడు గా ఉంది, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక బాధ్యత గల తండ్రి పాత్రలో కనిపిస్తాడు, తన కుటుంబాన్ని కాపాడుకునే పాత్రలో కనిపిస్తాడు.
అతను తీసుకున్న నిర్ణయాలు తన కుటుంబం మీద ఎలా ప్రభావం చూపాయి ? తండ్రి గా అలాగే ఒక నాయకుడిగా తను తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా కాదా వాటి వల్ల ఎం జరిగింది. జరిగిన పరిణామాల వల్ల జాక్ ఎంతగా మానసికంగా కృంగిపోతాడు ఇలాంటి ఎమోషనల్ స్ట్రగుల్స్ ఆ పాత్రకు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
ఈ సినిమా లో నేయితిరి పాత్ర ఎలా ఉంది:-
నిజానికి ఈ సినిమాలో హైలెట్ పాత్ర అంటే నెయితిరి పాత్ర, ఎందుకు అంటే ఆ పాత్ర లో బాధ, కోపం, ప్రతీకారం ఈ మూడు వేరియేషన్స్ తో కలిసి ఉంటుంది, కొన్ని సీన్స్ లో ఆమే నటించిన విధానం ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.
ఆమే పాత్ర ఈ సినిమాలో కేవలం హీరోయిన్ పాత్ర అని కాదు , ఆమె ఒక నావీ మహిళగా, ఒక తల్లిగా, అలాగే ఒక పోరాట యోధురాలిగ ఇలా ఆమె పాత్ర సినిమా లో మెయిన్ పాత్రగా అలాగే బలంగా కనిపిస్తుంది.
బాలయ్య బాబు నటించిన అఖండ 2 తాండవం సినిమా ఎలా ఉందో ఇది చదివి తెలుసుకోండి.
మరి ఈ సినిమాలో Ash people ఎట్లాంటి వాళ్ళు?
ఈ మూవీకి Ash people plus point గా ఉంటుంది. వాళ్ళని పూర్తిగా నెగటివ్ రోల్ లో చూపించడం కాకుండా వాళ్ళ నమ్మకాలతో వాళ్ళ way off life తో బ్రతికే ఒక తెగ ప్రజలుగా చూపించడం ఈ సినిమా కథ కి బలంగా మారింది.
అక్కడ జీవించే ప్రజలు నార్మల్ గా ప్రకృతిని దేవుడిలా పూజిస్తారు కానీ ఈ సినిమా లో కొంత మంది నావీలు అలా పూజించని వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఒకవేళ కేవలం శక్తి నమ్ముకొని అదే ముఖ్యం అని అనుకునే తెగ జాతి ప్రజలు పాండోర గ్రహంలో ఉంటే ఎలా ఉంటుంది అని మనకు అనిపిస్తే దానికి ఈ సినిమా సమాధానం ఇస్తుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా లో దర్శకుడు జేమ్స్ కామెరూన్ మంచి చెడు కంటే ఎక్కువగా గ్రే షేడ్స్ నీ హైలెట్ చేసి చూపించడం జరిగింది.
ఈ సినిమా లో విజువల్స్ ఎలా ఉన్నాయి ?
ఆల్రెడీ అవతార్ మొదటి సినిమా రెండవ సినిమా విజువల్స్ పరంగా ఏ లెవెల్ లో ఉన్నాయో మనకు తెలుసు, ప్రపంచ సినిమా చరిత్రలో జేమ్స్ కామెరూన్ అవతార్ అనే సినిమా తో ఒక అద్భుతమైన ఒక కొత్త ప్రపంచం సృష్టించిన విషయం తెలిసిందే ఆ సినిమా ప్రేక్షకుల కి ఎలాంటి అనుభూతి ఇచ్చిందో కూడా తెలుసు, ఆ సినిమా ఎంత పెద్ద హిట్టు అయ్యిందో కూడా తెలుసు, ఇప్పుడు మూడవ భాగం అయినా ఈ అవతార్ 3 fire and Ash మూవీ ఇంకా excellent గ్రాఫిక్స్, vfx తో ఇంకా కొత్త ప్రపంచం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా లో కనిపించే లావా ప్రాంతాలు, బూడిద తో ఉన్న ప్రాంతాలు, అగ్ని , అలాగే అరణ్యాలు వాటి యొక్క విజువల్స్ next level లో కనిపిస్తాయి.
ఈ సినిమా లో మ్యూజిక్ effects ఎలా ఉన్నాయి ?
అవతార్ 3 లో మ్యూజిక్ అలాగే background score డార్క్ గా ఉంటుంది, లో టోన్ లో వచ్చే మ్యూజిక్ ఈ సినిమా కథ నీ బలంగా చూపిస్తుంది. Tribal people వచ్చినప్పుడు వచ్చే ఫైర్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఒక మంచి ఫీల్ తో వేరే ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
ఈ సినిమా మనకి ఏం తెలియచేస్తుంది ?
1, కోపం వల్ల జరిగే నష్టం ఏంటి దాని వల్ల చివరికి ఏం అవుతుంది, అని కోపం గురించి మంచి సందేశం ఇచ్చాడు జేమ్స్ కామెరూన్.
2, భూమి మీద ఉన్న ప్రతి జాతి ప్రజలలో మంచి చెడు అనేవి ఉంటాయి అవి ఎలా వస్తాయి మనం ఏది నేర్చుకోవాలి ఎలా ఉండాలి అని చాలా చక్కగా చెప్పారు.
3, ఒకవేళ మనం ప్రకృతిలో ఉండి అదే ప్రకృతిని నాశనం చేస్తూ అదే ప్రకృతితో యుద్ధం చేస్తే మన మీదికి ఎలాంటి పరిణామాలు వస్తాయి, మన పరిస్థితి ఎలా ఉంటుంది అని మంచి మెసేజ్ నీ ఇచ్చాడు జేమ్స్ కామెరూన్, అలాగే మన దగ్గర ఉన్న శక్తిని మంచి కోసం కాకుండా చెడు కోసం ఉపయోగించుకుంటే ఏం జరుగుతుందో చూపించాడు. ఈ సినిమా కేవలం సినిమా కాదు మనుషుల నిజ జీవితంలో కూడా జరిగే, జరుగుతున్న సంగతులను వివరించే ప్రయత్నం చేస్తూ ఒక మంచి సందేశం ఇచ్చాడు జేమ్స్ కామెరూన్ అవతార్ 3 fire and Ash అనే సినిమా ద్వారా అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి మంచి విషయాలు తెలుసుకోవాలని అవి పాటించాలి అని నేను కోరుకుంటున్న, మరి మీరు ఏం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.
# ఈ సినిమా లో ఉన్న కొన్ని నెగెటివ్ షేడ్స్ ఏంటి ?
ఈ సినిమా కథ కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది అక్కడక్కడ.
సినిమా run time కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కొంతమందికి.
ఫైనల్ గా ఈ సినిమా అవతార్ రెండు సినిమాలు కంటే కూడా ఇంకా సూపర్ గా ఉంది అని నాకు ఐతే అనిపించింది.
ఈ సినిమా కి నేను ఇచ్చే rating (4.2/5)
Thank you...

0 కామెంట్లు