భారత టెస్టు క్రికెట్ కి కొత్త కోచ్ : vvs laxman, గంబీర్ అవుట్ ఈ వార్తలో నిజం ఎంత ?
ప్రజెంట్ క్రికెట్ అభిమానుల మధ్య దేశం మొత్తం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన వాళ్ళకి ఏ చిన్న పాయింట్ దొరికిన దాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో పెట్టి వాటిని అన్నిటిలో తిప్పి తిప్పి తెగ వైరల్ చేయడం మనకు తెలిసినంతగా ఇంకా ఎవరికి తెలియదు అందుకే ఇప్పుడు ఈ వార్తా తెగ వైరల్ అవుతుంది.
క్రికెట్ ఆటలో ఏ చిన్న పాయింట్ మనకి దొరికిన దాన్ని పట్టి పట్టి లాగుతం, ఈ వార్తా వైరల్ అవడానికి కారణం కూడా లేకపోలేదు అది ఏంటి అంటే ఈ మద్య కాలంలో లెజెండరీ ప్లేయర్ అయిన అలాగే మన దేశ క్రికెట్ కి ఎన్నో విజయాలు రావడంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ గౌతం గంభీర్ అతను క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చి చాలా ఏళ్లు అవుతుంది, ఇప్పుడు అతను టీం ఇండియా కి కోచ్ గా కొత్త అవతారం ఎత్తి తన మార్క్ ఆలోచనలతో మంచి విజయాలు అందించాలి అని అనుకోని కోచ్ గా వచ్చాడు వచ్చిన కొత్తలో కొన్ని సిరీస్ లు మంచిగా గెలిచాయి కూడా కానీ ఈ మద్య కాలంలో వరసగా అన్నీ సిరీస్ లు ఒడుతూ వస్తుంది టీం ఇండియా, ముక్యంగా అన్నీ టెస్టు సిరీస్ లలో ఓడింది దాని వల్ల వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ కి కూడా మన టీం అర్హత కోల్పోయింది, వీటి అన్నిటి వల్ల 3 ఫార్మాట్స్ లో అతనే కోచ్ గా ఉంటే stress ఎక్కువ అవుతుంది అని గంభీర్ ని టెస్టు ఫార్మాట్ నుండి తొలగిస్తున్నారు అని వీళ్ళకి వీళ్ళే ఊహించుకొని ఈ వార్తని వైరల్ చేశారు.
ఇప్పుడు ఉన్న భారత టెస్టు క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్ నీ పక్కన పెట్టీ అతని స్థానంలో ఒకప్పుడు ఇండియన్ టీమ్ కి ఆడి ఎన్నో విజయాలు అందించిన vvs లక్ష్మణ్ నీ టెస్టు క్రికెట్ కోచ్ గా తీసుకుంటున్నారు అని అన్నీ సోషల్ మీడియా plotforms లో తెగ వైరల్ చేశారు.
మరి ఈ వార్తలో నిజం ఎంత ?
నిజంగా అలాంటి నిర్ణయం bcci తీసుకుందా లేదా ఆది కేవలం పుకార్లు మాత్రమేనా అసలు ఏది నిజం అని ఈ పోస్ట్ లో క్లియర్ గా తెలుసుకుందాం.
ఇప్పటివరకు అయితే bcci ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు కి head coach గా ఉన్న గౌతమ్ గంభీర్ ను టెస్టు క్రికెట్ కోచ్ గా తొలగిస్తున్నాం అని అలాగని కొత్త కోచ్ గా vvs laxman నీ తీసుకుంటున్నాం అని కూడా చెప్పలేదు, కేవలం ఇవ్వన్నీ సోషల్ మీడియా పుకార్లు మాత్రమే, క్రికెట్ అభిమానులు అనుకుంటున్న అభిప్రాయం మాత్రమే ఇది నిజం కాదు మరి ఈ వార్తలు రావడానికి కారణం ఏంటి ?
* ఇటీవల భారత్ టెస్ట్ ఫార్మాట్ లో ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడం దానికి head coach గా గౌతమ్ గంభీర్ ఉండటం ఒక కారణం.
* అందులోనూ odi matches అలాగే T20 matches లో బాగా రాణించి కేవలం టెస్టు సిరీస్ లలో ఓడిపోవడం, ఇండియన్ ప్లేయర్స్ బౌలర్స్ బౌలింగ్ లో అలాగే బ్యాటర్స్ బ్యాటింగ్ లో విఫలం అవ్వడం, ఎవరిలోనూ నిలకడ లేకపోవడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ లు ఓడిపోవడంతో హెడ్ కోచ్ గా ఉన్నా గౌతమ్ గంభీర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
* ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడూ అయినా మన జట్టు ఓడిపోతే వెంటనే మనమే విమర్శలు చేస్తాం టీమ్ ప్లేయర్స్ నీ, ఒక ప్లేయర్ 10 matches మంచిగ ఆడి ఒక్క మ్యాచ్ మంచిగా ఆడకపోయిన అతన్ని ఇష్టం వచ్చినట్లు తిడతాం, బ్యాడ్ గా కామెంట్ లు పెడతాం నీకు అవసరమా క్రికెట్ రిటైర్మెంట్ ఇవ్వు అని ఓ నానా గోల చేస్తాం సోషల్ మీడియా లో, ఎవరికి నచ్చిన ప్లేయర్ ఉంటాడో అతను నిజంగా ఆడకపోయిన కూడా అతను ఉండాలి అంటారు, ఒకవేళ వాళ్ళకి నచ్చని ప్లేయర్ 10 matches మంచిగా ఆడి ఒక్క మ్యాచ్ మంచిగా ఆడకపోయిన కూడా అతను వద్దు అని ఇష్టం వచ్చినట్లుగా లేని పోనీ అబద్దాలు క్రియేట్ చేసి ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో పోస్ట్ లు పెట్టి వైరల్ చేస్తారు ఇది అందరికీ కామన్ అయిపోయింది, కానీ అలా చేయడం తప్పు కదా అవతల వాళ్ళు ఎంత బాధ పడతారో ఇలా అబద్దాలు షేర్ చేస్తే అన్న ఆలోచన కూడా లేదు, అందులోనూ టీమ్ కోచ్ మీద ఇంకా ఎక్కువ గా విమర్శలు చేస్తాం వెంటనే ఈ కోచ్ నీ తొలగించండి అని అందులో భాగంగానే గౌతమ్ గంభీర్ మీద విమర్శలు పెరిగి ఇతను టెస్టు క్రికెట్ కోచ్ గా తప్పుకోవాలి అని కొత్తగా ఎవరు అయితే బాగుంటుంది అని ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ లెజెండ్ ప్లేయర్ అయిన vvs laxman అయితే బాగుంటుంది అని అందులోనూ అతనికి నేషనల్ క్రికెట్ అకాడమీ లో పని చేసిన అనుభవం ఉంది కాబట్టి అతను అయితే బాగుంటుంది అని అభిమానులు ఎవరికి వారే అనుకొని ఆ మాటలను వైరల్ చేశారు.
ICC cricket T20 World Cup tickets bookings గురించి ఇది చదివి తెలుసుకోండి.
మరి ఈ వార్తల మీద bcci ఎలా స్పందించింది ?
* గంబీర్ భారత టెస్టు క్రికెట్ కోచ్ గా కొనసాగుతున్నాడు అని, అతన్ని తొలగించే నిర్ణయం చర్చలు అట్లాంటివి ఏం జరగలేదు అని, VVS Laxman నీ టెస్టు క్రికెట్ కోచ్ గా తీసుకుంటున్నాం అన్నది పూర్తిగా అవాస్తవం అని bcci అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతో ఈ అబద్దపు ప్రచారానికి అడ్డు కట్ట పడింది, ఇలా ప్రచారం చేసిన వాళ్ళకి బుద్ది చెప్పినట్లు అయ్యింది.
* కోచ్ నీ మార్చడం ఇప్పుడు అయితే లేదు కానీ మరి భవిష్యత్తు లో మార్చే చాన్స్ ఉందా అంటే అది టీమ్ విజయాల మీద ఆధారపడి ఉంటుంది అని ఒకవేళ ఇలాగే ఓటములు చవి చూస్తే అది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, అలాంటి సందర్భం వస్తే అప్పుడు bcci ఆలోచించి నిర్ణయం తీసుకొని అది కూడా బోర్డు లో సెలెక్షన్ కమిటీతో చర్చలు జరిపి అధికారికంగా ప్రకటిస్తాం అని చెప్పారు.
మరి గంభీర్ కోచ్ గా ఎలా ఉన్నాడు ?
* గంభీర్ ఎక్కువగా యువ క్రికెటర్ల కి అవకాశాలు ఇస్తాడు.
* ప్లేయర్స్ మద్యలో పోటీ పడి మరీ ఆడే మెంటాలిటీని అలవాటు చేశాడు.
* Strict rools పాటిస్తారు.
ఇప్పటివరకు అయితే గంభీర్ odi matches అలాగే T20 matches లో టీమ్ ఫలితాలు బాగా తీసుకొచ్చాడు, కేవలం టెస్టు సిరీస్ లో కొన్ని ఓడిపోవడం జరిగింది, టెస్టు క్రికెట్ లో రిజల్ట్ అనేది వెంటనే రాదు జట్టు కూర్పు ఆటగాళ్ళ ఫామ్ అన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి, కేవలం కోచ్ మీద ఉండదు కాబట్టి టెస్టు టీమ్ సెట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైమ్ పడుతుంది కావచ్చు చూద్దాం ఇంకా కొన్ని రోజులు,
ఇప్పటివరకు అయితే గంభీర్ ను తొలగించి vvs laxman నీ తీసుకుంటున్నాం అన్న వార్త మాత్రం నిజం కాదు అది కేవలం అభిమానులు కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు create చేసిన పుకార్లు మాత్రమే అని bcci అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇప్పుడు మీకు క్లారిటీ గా అర్థం అయ్యింది అనుకుంటున్న , ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం డైలీ మన ఈ website visit చేస్తూ ఉండండి.
నోట్:- యువత ఇలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా విషయం మనం చూశాం అంటే అది నిజమా కాదా అని ఒక్కటికి రెండు సార్లు చూసుకొని అవసరం అయితే ఆ విషయం మీద లోతుగా పరిశోదన చేసి నిజ నిజాలు తెలుసుకొని ఆ తర్వాత పెట్టాలి అంతే కానీ అబద్దాలు మాత్రం ప్రచారం చేయకండి అలా చేస్తే అవతలి వాళ్ళకి అన్యాయం జరగవచ్చు లేదా ఇంకా ఏమైనా జరగవచ్చు కాబట్టి ఏది చేసిన ఆలోచించి తెలుసుకొని ప్రచారం చేయండి.
ఇది నేను మీకు ఈ ఆర్టికల్ ద్వారా చెప్పాలి అనుకున్న చెప్పిన మీకు ఎలా అనిపించింది అనేది మళ్ళీ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ విషయాల కోసం అలాగే మన లైఫ్ లో ఉపయోగపడే మంచి మంచి విషయాలు తెలుసుకోవడం డెయిలీ మన వెబ్సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి.
Thank you...

0 కామెంట్లు