బాలయ్య బాబు నటించిన అఖండ 2 తాండవం movie review telugu

అఖండ 2 తాండవం movie review:- 

తెలుగులో బాలయ్య బాబు గారు నటించిన హై ఓల్టేజ్ చిత్రం అఖండ 2 తాండవం.

ఈ మూవీ లో బాలయ్య బాబు గారు ఒక ఆఘాతభరిత మైన శివ తాండవం చూపించాడు.

మరొకసారి బాలయ్య బాబు మరియు బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన అఖండ సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ ఈ అఖండ 2 తాండవం, బాలయ్య బాబు ఫ్యాన్స్ నీ అలాగే మూవీ లవర్స్ ను ఆకట్టు కుంటుంది.


ఇప్పుడు కథ లోకి వెళ్దాం:- 

అఖండ 2 సినిమా కథ అఖండ పార్ట్1 ఎక్కడ అయితే ముగిసిందో అక్కడ నుండే అఖండ 2 ప్రారంభం అవుతుంది.

ధర్మం, దుష్టసంహారం మధ్య నడిచే ఒక ఆధ్యాత్మిక మరియు మాస్ ఎలివేషన్స్ కలిగి ఉన్న మూవీ ఈ అఖండ 2 తాండవం . 

అఖండ మొదటి భాగం లో విలన్ పాత్ర నార్మల్ గా ఉండి హీరో పాత్ర డామినేటెడ్ గా ఉంటుంది, కానీ ఈ రెండవ భాగం అఖండ 2 తాండవం లో హీరో బాలయ్య బాబు పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో విలన్ పాత్ర కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది.

ఈసారి విలన్ పాత్ర సాధారణ మనిషి గా ఉండదు అతనికి తాంత్రిక శక్తులు, ఇంకా రాజకీయ ప్రభావం మరియు బారి మాఫియా కలగలిపి భయంకరంగా ఉంటుంది.

అతనికి కాళీ మాత నుండి వచ్చిన రాక్షస శక్తులు ఉంటాయి.

హీరో బాలయ్య బాబు పాత్ర అతను ఒక అఘోరా శివ భక్తుడు, ధర్మం కోసం దాన్ని కాపాడటం కోసం పవర్ ఫుల్ గా కనిపిస్తాడు. బాలయ్య బాబు అఘోరా రూపం ఈసారి ఇంకా క్రూరంగా పవర్ ఫుల్ గా కనిపిస్తాడు. బాలయ్య బాబు ముఖం లో ఒక రకమైన రౌద్రం కనిపిస్తుంది.

దాని వల్ల అఖండ 2 తాండవం movie మొత్తం ఒక ఆధ్యాత్మిక యుద్ధం లాగా నడుస్తుంది.

శివతాండవం సన్నివేశాలు బోయపాటి శ్రీను ఇప్పటివరకు తీసిన సినిమాల కంటే మించి పెద్ద స్కేల్ లో కనిపిస్తాయి.

మూవీ లో ఉపయోగించిన ఆయుధాలు, ఆధ్యాత్మిక శ్లోకాలు, ఆర్భాటాలు అన్ని కూడా ప్రతీ ఫ్రేమ్ లో కనిపించి ఒక మంచి ఫీల్ ను ఇస్తాయి.

బాలయ్య బాబు నీ ఇలాంటి పాత్ర లో చూడటం అంటే అభిమానుల కి మాస్ పండగ లాగ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా లో బాలయ్య బాబు పాత్ర ఇంకా ఎక్కువ మాస్ గా ఉంటుంది ప్రత్యేక ఆకర్షణగా నిలబడుతుంది. సాధారణ ప్రేక్షకుల కి కూడా ఒక మంచి విజువల్ వండర్ గా అనిపిస్తుంది.


బోయపాటి శ్రీను దర్శకత్వం మాస్ ఎలివేషన్ కి పెట్టింది పేరు.

అతను అఖండ 2 తాండవం movie నీ ఒక ఆధ్యాత్మిక మైథాలజికల్ గా మాస్ యాక్షన్ గా తీసుకెళ్లాడు.

బోయపాటి శ్రీను దర్శకత్వం హైలైట్స్:- 

విలన్ పాత్ర నీ రూపొందించిన విధానం చాలా బాగుంది భయంకరంగా ఉంది.

అఖండ పాత్ర లో బాలయ్య బాబు గారి ఎంట్రీ సీన్ థియేటర్ నీ అరుపులతో మారు మోగిస్తోంది.

ప్రతీ ఫైట్ కూడా ఒక దుర్భేద్యమైన యుద్ధం లాగ అనిపిస్తుంది.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమాలు సాధారణంగా మాస్ యాక్షన్ తో కలిసి ఉంటాయి కానీ ఈసారి మాస్ తో పాటు ఎమోషన్స్ మరియు ఆధ్యాత్మికత తో కలగలిపి చూసే వాళ్ళకి ఒక మంచి ఫీల్ నీ ఇస్తుంది.


మూవీ లో ఉన్న ప్రధాన యాక్షన్ సీన్స్ గురించి వివరణ:- 

1, స్మశానంలో జరిగే అఘోరా మరియు కాళీ మాంత్రికుల తో ఫైట్ సీన్స్ బాగా ఉంటాయి.

2, 100 మందిని బాలయ్య బాబు ఒకేసారి చేధించే సీన్ హైలెట్ గా ఉంటుంది.

3, ఇకపోతే క్లైమాక్స్ సీన్స్ ఆ యుద్ధం ఎలా ఉంటుంది అంటే అగ్ని, ధూళి, గాలి అన్ని కలగలిపి ఒక పవర్ ఫుల్ గా ఉంటుంది. 

విజయ్ దేవరకొండ నటించిన kingdom మూవీ రివ్యూ in Telugu

ఇకపోతే ఈ సినిమా మ్యూజిక్ గురించి వివరణ:- 

తమన్ గారి మ్యూజిక్ ఆల్రెడీ అఖండ మూవీ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టింది అందరికీ తెలుసు కదా 

ఇప్పుడు అఖండ 2 కి దాని కంటే ఎక్కువే ఇచ్చాడు.

శివ తాండవం background స్కోర్ ఈ మూవీ లో 5 వెరిషన్స్ లో వస్తుంది ఆది బాగుంటుంది.

ఇకపోతే విలన్ కి ఇచ్చిన మ్యూజిక్ ఒక రకమైన రౌద్రాన్ని రేకెత్తిస్తుంది.

ఫైట్ సీన్స్ లో వచ్చే మ్యూజిక్ మూవీ నీ next లెవెల్ కి తీసుకెళ్తుంది.

తమన్ గారు ఈ చిత్రానికి ప్రత్యేక పరిశోధన చేసి మరీ ఆధ్యాత్మిక శ్లోకాలు మిక్సింగ్ తో excellent music ఇచ్చాడు అని చెప్పవచ్చు.


ఈ మూవీ లో విలన్ పాత్ర శక్తి, ఈ సినిమా నీ నిలబెట్టింది అలాగే next లెవెల్ కి తీసుకువెళ్ళింది అని చెప్పవచ్చు.

ఈ మూవీ లో విలన్ పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలబడుతుంది హీరో తో సమానంగా పోరాటం చేసేది మూవీ లో ఉద్వేగాన్ని పెంచుతుంది.


మూవీ లో ఎమోషనల్ సీన్స్ కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకుల నీ కట్టి పడేస్తాయి.

గురువు మరియు శిష్యుల మధ్య సంబంధం గురించి మంచిగా చూపించారు.

శివ భక్తుడు అయిన అఖండ అదే మన బాలయ్య బాబు గారి పాత్ర లో ఆ బాధ కనెక్ట్ అవుతుంది.

ఆ గ్రామం మీదికి వచ్చిన ప్రమాదం దాని వివరణ అలాగే బాలయ్య బాబు చేసే వాగ్ధానం సీన్ కూడా బాగా పండుతుంది. ఇవ్వన్నీ కూడా మూవీ నీ next level కి తీసుకెళ్తాయి.


ఈ సినిమా లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి:- 

బోయపాటి శ్రీను మూవీస్ లో కొన్ని మాస్ సినిమాల్లో ఉండే కొన్ని మైనస్ లు ఈ సినిమా లో కూడా ఉన్నాయి.

కొన్ని సార్లు యాక్షన్ సీన్స్ లాగ్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

విలన్ పాత్ర కొన్ని సార్లు slow గా వెళ్తున్న ఫీల్ కూడా వస్తుంది.

కొన్ని సార్లు లాజిక్ మర్చిపోయి మాస్ ఎలివేషన్ కి ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తుంది.


మూవీ క్లైమాక్స్ ఎలా ఉంది ? 

అఖండ 2తాండవం పూర్తిగా ఒక రౌద్ర రూపాన్ని చూపిస్తుంది

చివరి క్లైమాక్స్ సీన్స్ ఒక ఆధ్యాత్మిక యుద్ధం లాగా అనిపిస్తుంది.

శివుని శక్తి మరియు తాంత్రిక శక్తులు మధ్య పోరు విజువల్ గా చూపించిన విధానం excellent గా ఉంటుంది.

బాలయ్య బాబు గారి చివరి మాటలు శివ తాండవం నృత్యం అలాగే మంచి VFX వర్క్ ఇవ్వన్నీ మూవీ నీ చూసే వాళ్ళని ఆశ్చర్యం కి గురి చేస్తుంది.

చివరిగా ముగింపు మాటలు:- 

ఫైనల్ గా అఖండ 2 తాండవం movie కేవలం ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక విజువల్ వండర్ మూవీ.

ఈ మూవీ బాలయ్య బాబు అభిమానుల కి పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది.

మాస్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

ఆధ్యాత్మిక సినిమాలు ఇష్టపడే వారికి ఇంకా ఎక్కువ గా నచ్చుతుంది.

Overall గా బాలయ్య బాబు నటించిన అఖండ 2 తాండవం సినిమా అందరికీ నచ్చుతుంది.

ఈ మూవీ కి నేను ఇచ్చే రేటింగ్ (3.8/5)

మీకు ఎలా అనిపించింది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి విషయాల కోసం మన website నీ daily visit చేస్తూ ఉండండి.

                                 Thank you...