Republic day truths in india, reality of india.


 గణతంత్ర దినోత్సవం వచ్చి 1950 నుండి ఇప్పటివరకు మన భారతదేశంలో జరిగింది ఏంటి ? ఇన్ని సంవత్సరాల వెనక ఉన్న అసలు నిజాలు ఏంటి ? బాద్యతలు ఏంటి ?    

మన దేశంలో ప్రతి సంవత్సరం 26 జనవరి గణతంత్ర దినోత్సవం వస్తుంది . మన జాతీయ మూడు రంగుల జెండాను ఎగురవేసుకుంటాం. 

ఢిల్లీ లో అధ్బుతంగా కవాతులు, విన్యాసాలు పరేడ్ గ్రౌండ్లో  నిర్వహిస్తారు  అవ్వన్నీ tv లో live లో చూపిస్తారు  మనం అంధరం వాటిని చూసి హ్యాపీ గా ఫీల్ అవుతాం, మిటాయిలు పంచిపెట్టుకొని గర్వంగా ఫీల్ అవుతాం అందులో తప్పు లేదు, అలాగే ఫీల్ అవ్వాలి అందరం అన్న తమ్ముల లాగా కలిసి ఉండాలి అవ్వన్నీ ఓకే కానీ నిజంగా అలా ఫీల్ అయ్యే పరిస్థితులు మన దేశంలో ఉన్నాయా ఒక్క క్షణం అందరం ఆలోచించుదాం .     


 -- అసలు Republic day అంటే ఎంటో మనలో ఎంత మందికి తెలుసు ?

-- మన రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అమలు            అవుతున్నాయ ? 

-- ఆ ఒక్క రోజు దేశాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ అన్నీ మర్చిపోవడమేన ?

-- లేదంటే ఆ రోజుని సెలవు రోజు అని గడిపి మర్చిపోతున్నామా ?

    పైన ప్రశ్నలకి నిజమైన సమాదానం నిజాయితీగా మనమే తెలుసుకోవాలి, మీరు తెలుసుకుంటారు అని నేను అనుకుంటున్నా. 

భారతదేశం తీసుకున్న నిర్ణయం 

200 సంవత్సరాలు బ్రిటీషు వారి పాలనలో ఉన్న మన దేశం 1947 లో అనేక పోరాటాల తర్వాత ఎంతో మంది ప్రాణ త్యాగాల తర్వాత మనకు స్వాతంత్య్రం వచ్చింది. 

కానీ ఎలా పరిపాలించుకోవాలో తెలియదు దానికోసం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఏర్పడి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రచించి దాన్ని 1950 వ సంవత్సరంలో జనవరి 26 న అమలు చేసి మన దేశాన్ని గణతంత్ర దేశంగా మార్చారు. 

ఇక్కడ స్వాతంత్రం అంటే వేరే దేశం వాళ్ళ పాలన నుండి విముక్తి పొందడం. 

గణతంత్రం అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడం అని అర్ధం 

రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలు:-

ఈ దేశంలో ఎవ్వరూ కూడా రాజులు కాదు. 
అలాగే ఈ దేశంలో ఎవ్వరూ కూడా బానిసలు కాదు. 
మన భారతదేశ చట్టం ముందు అందరూ సమానమే. 

   ఇది కేవలం మాట లేదా నినాదామో కాదు ఇది ఒక హామీ.  


భారత రాజ్యాంగం అనేది ఒక సామాజిక ఒప్పందం :-

 మన రాజ్యాంగం ప్రపంచంలోనే అన్నీ రాజ్యాంగాల కంటే అతి  పెద్ద లికిత రాజ్యాంగం.   

 అసలు అందులో ఏం ఉంది. దేని గురించి చెప్పింది . 


    -- మన దేశంలో ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్చా ఉంది 

    -- మన దేశంలో ధనవంతుడు, పేదవాడు ఇద్దరూ చట్టం ముందు సమానమే 

    -- కులం, లింగం, మతం ఆదారంగా ఎవరి పైన కూడా వివక్ష చూపించ కూడదు 

    -- ఈ దేశ పౌరులందరికీ న్యాయం పొందే హక్కు ఉంది 

    -- ఈ దేశ పౌరులందరికి జీవించే హక్కు ఉంది కాదు అనడానికి ఎవరికి హక్కు లేదు 

           పైన చెప్పినవన్నీ భారత ప్రజలకి ఒక అధ్బుతం అది ఒక మంచి పరిణామం 

          కానీ అవ్వన్నీ ఎంతవరకు జరుగుతున్నాయి అన్నదే ఇక్కడ ప్రశ్న ?  

          పైన చెప్పినవన్నీ ఇప్పటివరకు నిజం గా జరిగాయా లేదా కలగా మిగిలిపోయాయ ఒక్కసారి చర్చించుకుందాం. 


మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన అప్పటినుండి ఇప్పటివరకు మన దేశం ఎలా నడిచింది ఏం సాదించింది ఇప్పుడు తెలుసుకుందాం 

 -- భారత దేశం ఇప్పటివరకు సాదించిన మార్పులు :- 

     -- మన దేశంలో టెక్నాలజీ అభివృద్ది చెందింది 
     -- అంతరిక్ష పరిశోదనలు జరుగుతున్నాయి 
     -- ప్రపంచ దేశాలలో మన దేశానికి  కొంత గుర్తింపు వచ్చింది
     -- ప్రపంచ దేశాల రాజకీయాలలో కూడా మన దేశానికి కొంత గుర్తుంపు వచ్చింది అన్న మాట               వాస్తవం
     -- ప్రజల ఆరోగ్యానికి సంబందించి వైద్య సదుపాయాలు అప్పటితో పోల్చితే ఇప్పుడు కొంచెం               మెరుగు పడ్డాయి
     -- మన దేశంలో అక్షరాస్యత అప్పటికి ఇప్పటికీ పెరిగింది
     -- ప్రజల జీవన విదానంలో కొంత మార్పు వచ్చింది 

   77 సంవత్సరాల కాల వ్యవదిలో ఈ కొన్ని మార్పులు జరగడం సరిపోతుందా 
   ఒకే సరిపోతుంది అనుకుందాం, జరగనివి ఇంకా చాలా ఉన్నాయి కదా మరి వాటి సంగతి ఏంటి ? 
 

మన దేశంలో ధనవంతుడికి అలాగే పేదవాడికి ఇద్దరికీ ఒకే న్యాయం జరుగుతుందా ? 

  మన దేశంలో జరుగుతున్న వాస్తవం ఇది :-

    ధనవంతుని పరిస్థితి :-

  -- తప్పు చేసిన కూడా ఈసీగా తప్పించుకుంటాడు 
  -- డబ్బు పెట్టి పెద్ద పెద్ద లాయర్లని కొంటాడు 
  -- న్యాయాన్ని డబ్బుతో కొంటాడు 
  -- ఎంత తప్పు చేసిన ఈసీగా వెంటనే బెయిల్ తెచ్చుకుంటాడు 
  -- అతను కావాలి అనుకుంటే కేసును ఎన్ని ఇయర్స్ అయినా లాగగలడు 
  -- చట్టంలో ఉన్న లొసుగులు అన్నీ అతని కోసం పని చేస్తాయి 
  -- డబ్బు ఉంది అన్న పొగరుతో నేను ఏం చేసిన రైట్ నన్ను ఎవరు ఏం చేయలేరు అని విచ్చల          విడిగా తప్పలు చేసి తప్పించుకుంటారు 
  -- లంచాలు పెట్టి అక్రమ పనులు చేసి పేద ప్రజలను దోచుకుంటారు 
  -- తప్పు చేసిన కూడా కాలర్ ఎత్తుకొని మరీ బయపడకుండా పోలీస్ వాళ్ళతోటి గొడవ పెడుతారు 

నోట్:- పైన చెప్పినవి అందరు డబ్బు ఉన్న వాళ్ళకి వర్తించవు అందులో కొంత మంది చాలా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు నిజాయితీగా ఉంటారు మంచి పనులు చేస్తారు. కానీ అలాంటి మంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 

పేదవాని పరిస్థితి :-

 -- పేదవాడు ఎలాంటి తప్పు చేయకున్నా కూడా పోలీస్ స్టేషన్ కి పోవాలి అంటే బయపడుతూ             తల ధించుకొని వెళతాడు
 -- వాళ్ళు ఏది చెప్తే అదే విని సైలెంట్ గా ఉంటాడు 

 -- ఒకవేళ కోర్టు కి వెళ్ళాలి అంటే బయం అక్కడ లాయర్ కి ఎంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో           అని ఎంధుకు అంటే అతని దగ్గర డబ్బు ఉండదు కాబట్టి 

 -- రోజు కూలి పనికి వెళ్తే గాని ఇంట్లో పూట గడవదు అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు తప్పు                 చేయకున్న కూడా కోర్టు కి వెళ్ళి లాయర్ ని పెట్టుకొని న్యాయం కోసం పోరాడాలి అంటే అతను         డబ్బు ఎక్కడ నుండి తీసుకువస్తాడు అవతల డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు ఇచ్చి న్యాయాన్ని             కొనేస్తుంటే పేదవాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది 
 
-- కోర్టు లో ఏళ్ల తరబడి ఉన్న కేసులే వాదనకి రావడం లేదు ఇంకా పేదవాళ్ళ కేసులు ఎక్కడ              వస్తాయి రావు వాళ్ళు ఆ కేసుల కోసం చేసే కూలి పనులు వదులుకొని కోర్టు ల చుట్టూ తిరగాలి 

-- అక్రమ కేసుల వల్ల పేదవాళ్ళు బలి అవుతున్నారు

-- చివరికి ఆ కేసులు వదిలేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు  

-- పేదవాళ్లను డబ్బు ఉన్న వాళ్ళు బెదిరించి వాళ్ళ కింద బానిసలుగా చేసుకుంటున్నారు 

    

నోట్ :- మన  దేశంలో ఒకే చట్టం కింద రెండు వేరు వేరు న్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి పేదవాడికి ఒక రకంగా ఉన్న వాడికి ఒక రకంగా ఎందుకు జరుగుతున్నాయి ఇది మన రాజ్యాంగం ఇచ్చిన హామీ కాదు ఇది సమానత్వం అసలే కాదు మరీ ఇది రాజ్యాంగం యొక్క వైఫల్యమ అంటే కాదు ఇది కేవలం మన దేశ వ్యవస్థలోని లోపం, దీన్ని ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన ఇదే వాస్తవం మరీ మీరు ఏం అంటారు నాకు కామెంట్ లో తెలియచేయండి. 


మన దేశంలో అవినీతి మన డెవలప్మెంట్ కి  చాలా పెద్ద అడ్డంకిగా మారిందా ?    

మన దేశంలో ఎందుకు ఇంత  అవినీతి జరుగుతుంది :- 

 -- గవర్నమెంట్ అదికారులకి జవాబుదారీ తనం లేదు, వాళ్ళని గట్టిగా ఇది ఏంటి అని అడిగే వారు       లేరు

-- మన పని తొందరగా ఐపోవాలి అది కూడా అడ్డదారిలో అని చూసుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు సమాజంలో దాని వల్ల నల్ల డబ్బు ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ కి టాక్స్ రూపంలో అది కనపడదు దాని వల్ల దేశం డెవలప్మెంట్ జరగదు అని ఎవరు ఎంధుకు తెలుసుకోవడం లేదు 

-- లంచం అనేది ఇప్పుడు మన దేశంలో చాలా సర్వ సాదారణం అయ్యింది. ఎందుకు అంటే ప్రజలు అలాగే ఉన్నారు ప్రబుత్వాలు అలాగే ఉన్నాయి. దేశంలో చదువుకున్న యువత ఇంకా అంతకంటే ధారుణం గా ఉన్నారు 

-- లంచాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు దేశంలో అందరూ అలాగే తయారయ్యారు ఇది మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన ఇదే నిజం 

-- రాజకీయాల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది, దీని వల్ల ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది 

-- ఒకవేళ నిజాయితీగా ఉంటే వాళ్ళకి మన దేశంలో రక్షణ లేదు 

-- దేశంలో ఎక్కడ ఏం జరిగిన అడిగే వాళ్ళు లేరు 

-- ఏం జరిగిన అంతా మామూలే కదా మనకు అన్న పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం 

-- రేషన్ బియ్యం నుండి హాస్పిటల్ వరకు, గవర్నమెంట్ ఆఫీసు నుండి చిన్న కార్యాలయం వరకు, పోలీస్ స్టేషన్ నుండి బిజినెస్ ల వరకు, రాజకీయ నాయకుల నుండి అదికారుల వరకు, పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్న వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది 

నోట్ :- ఇందులో కేవలం గవర్నమెంట్ ది తప్పు అనడానికి లేదు , అదికారులది తప్పు అని ఏ ఒక్కరినీ బ్లెమ్ చేయడం కాదు ఈ అవినీతిలో ప్రతీ ఒక్కరూ పాలు పంచుకుంటున్నారు , ఎక్కడో ఒక దగ్గర నిజాయితీ పరులు కూడా ఉన్నారు, అందరం మన పని మనం కలిసి చేసుకుంటే ఎవరి పని వాళ్ళు నిజాయితీగా చేసుకుంటే మన దేశం ప్రపంచంలో అన్నీ దేశాల కంటే గొప్ప దేశం అవుతుంది డెవలప్మెంట్ లో , మీరు ఏం అనుకుంటున్నారు నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో.    

అవినీతి వల్ల జరిగే నష్టం ఏంటి ? 

-- ప్రజలకు భారత చట్టాల మీద నమ్మకం పోతుంది దాని వల్ల చాలా అనార్థాలు వచ్చే అవకాశం          ఉంటుంది 
-- ఈ దేశంలో పేదవాడు ఇంకా పేదవాడు అవుతాడు, కొనుగోలు శక్తి ఉండదు అలా జరిగితే                    కచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి 

-- ధనవంతుడు పేదలను దోచుకొని ఇంకా దనవంతుడు అవుతాడు, కేవలం 5% ప్రజలు                     ధనవంతులు అయ్యి మిగతా 95% ప్రజలు పెదరికంలో బ్రతకాలా చెప్పండి ? 

-- ప్రతిభ ఉన్నవాళ్ళు వాళ్ళకి వచ్చే అవకాశాలు కోల్పోతారు 

-- నిజాయితీగా బ్రతికే వాళ్ళు అసహనంతో మనస్తాపానికి గురి అయ్యి వ్యతిరేక శక్తులుగా                        తయారయ్యే అవకాశం ఉంది  
 

భారతదేశంలో  యువత పరిస్థితి ఎలా ఉంది ?  

 -- ప్రపంచంలో ఎక్కడ లేని యువత భారత దేశంలో ఉంది కానీ వాళ్ళు ఉండి  ఏం చేస్తున్నారు ? 
 
-- యువత ఏం ఆలోచిస్తున్నారు ఎటు వైపు వెళ్తున్నారు అర్ధం కాని పరిస్థితిలో ఉన్నారు 

-- కొంత మంది యువత మత్తుకి బానిసలు అవుతున్నారు, వ్యక్తి పూజ మోజులో పడి వాళ్ళ జీవితాల      గురించి కూడా ఆలోచించడం లేదు

-- సోషల్ మీడియా మోజులో పడి కొంత మంది యువత చెడు మార్గంలో నడుస్తున్నారు 

-- కొంత మంది యువతకి చదువుకి తగ్గ ఉద్యోగాలు లేక వాటి కోసం చూస్తూ రోజులు రోజులు                  గడుపుతూ వాళ్ళ లైఫ్ గందర గోళంలో పడిపోతుంది

-- కొంత మంది యువత ప్రైవేట్ రంగంలోకి వెళ్ళి చాలీ చాలని జీతాలకి పని చేస్తున్నారు 

-- కొంత మంది యువత చదివిన చదువుకి సంబందం లేని ఉద్యోగాలు చేస్తూ ఫామిలీస్ కోసం లైఫ్      త్యాగాలు చేస్తున్నారు 

-- కొంత మంది యువత  చదువులకి ధూరం అయ్యి లేబర్ పనులు చేస్తూ వచ్చిన డబ్బు ఫామిలికి      ఎటు సరిపోకుండా ఏదో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు 

-- కొంత మంది యువత ఇక్కడ ఉండటం ఇష్టం లేక దేశాన్ని విడిచి పెట్టి బయటి దేశాలకి                  వెళ్లిపోతున్నారు 

-- మెయిన్ గా యువత ప్రశ్నించడం మానేశారు 

-- నిజాయితీగా ఉండటం కూడా ఒక తప్పు అనే భావనలోకి వచ్చేశారు యువత 

-- కొంత మంది యువత అన్నీ అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్నారు 

-- మొత్తానికి అయితే ఈ దేశం బాగు పడాలి అందు కోసం మనం అన్నిటిలో ముందు ఉండి  దేశాన్ని ముందుకి నడపాలి రాజ్యాంగంలో ఉన్నట్లుగా నా దేశం నేను ఉండాలి అవ్వన్నీ నెరవేరాలీ నా దేశం ప్రపంచ దేశాల అన్నిటిలో ముందు ఉండాలి అన్న ఆలోచన ఉన్న యువత కేవలం 5% కూడా ఉండరు అంటే మీరు నమ్ముతార కానీ అదే నిజం. 


ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ? 

-- ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, నినాదాలు మారుతున్నాయి, సిద్దాంతాలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు కానీ ప్రజల సమస్యలు మాత్రం ఎందుకు మారడం లేదు ? 

-- పార్టీలు ఎన్నికల ముందు చాలా హామీలు ఇస్తారు కానీ గెలిచిన తర్వాత వాటిని గాలికి                        వదిలేస్తారు 

 -- కులం, మతం, భయం అనేవి వాళ్ళ యొక్క ఆయుధాలు గా మారాయి, అవ్వన్నీ తెలిసి కూడా         మనుషులు మారడం లేదు 

-- ఒకవేళ ఎవరైనా ముందుకి వచ్చి ప్రశ్నిస్తే వాళ్ళ మీద దేశ ద్రోహి అని ముద్ర వేస్తున్నారు 

-- ఇప్పటికీ అయిన ఇటు ప్రభుత్వాలు మంచిగా మారాలి అటు ప్రజలు మంచిగా మారాలి                    అందరం ఒక్కటిగా కలిసి పని చేస్తేనే మన దేశం డెవలప్ అవుతుంది   


అసలు అభివృద్ది అంటే ఏంటి ?

-- నిజమైన అభివృద్ది అంటే కేవలం దేశ GDP పెరగడం కాదు 

-- కేవలం రోడ్ల నిర్మాణాలు కాదు 

-- కేవలం రంగుల గోడలు అద్దాల మేడలు కాదు 

-- అబద్దపు మాటలు కాదు 

-- మీది మీది మెరుగులు కాదు 

-- పేరుకి కొన్ని సంక్షేమ పథకాలు పెట్టడం కాదు 

-- నిజమైన అభివృద్ది అంటే :-
   
      -- ప్రజాస్వామ్యం బ్రతకడం
 
      -- న్యాయం గెలవడం 

      -- అందరికీ ఒకేలాగా సమానత్వం చూపించడం 

      -- ప్రజలు కూడా అందరూ నైతికత తో జీవించడం 

      -- ప్రజలు అందరూ గౌరవంతో బ్రతకడం   


మరి మార్పు ఎలా వస్తుంది ? 

-- మార్పు ముందు మన నుంచే  రావాలి 

-- ఓటును బాద్యతతో కచ్చితంగా వినియోగించుకోవాలి, డబ్బు తీసుకొని ఓటు వేసే పద్దతి                     మానుకోవాలి 

-- లంచం ఇవ్వద్దు అలాగే తీసుకోవద్దు 

-- యువత రాజకీయాలలోకి రావాలి అందులో మార్పు తీసుకురావాలి 

-- తప్పు జరిగితే కచ్చితంగా ప్రశ్నించి అడగాలి 

-- మన పనిని మనం నిబద్దతతో నిజాయితీగా క్రమశిక్షణతో చేసుకోవాలి 

-- ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించి నడుచుకుంటే మన దేశం అన్నీ సాదిస్తుంది


-- గణతంత్ర దినోత్సవం కేవలం సెల్ఫీల కోసం, స్టేటస్ ల కోసం కాదు, మనుషుల మెప్పు కోసం          కాదు

-- సమానత్వం కోసం మనం నిలబడటానికి 

-- భారత రాజ్యాంగ విలువలు కాపాడటానికి 

-- మనం ఈ దేశ పౌరులుగా మన బాద్యతలను గుర్తు చేసుకోవడానికి జరుపుకోవాలి. 

చివరగా ఒక మాట :-

ఈ దేశం మనది, ఈ రాజ్యాంగం మనది. 

మనం మౌనంగా ఉంటే కచ్చితంగా అన్యాయం పెరుగుతుంది. 

ప్రశ్నిస్తే దేశం భలపడుతుంది 

భారత్ మాతకి జై

నేను రాసిన ఈ వ్యాసం కేవలం ఒక సాదారణ భారతీయ పౌరుడిగా నా యొక్క వ్యక్తిగత ఆలోచనలు మరియు పరిశీలనల ఆధారంగా రాశాను. ఇది ఏ రాజకీయ పార్టీ లేదా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని రాసింది కాదు దేశాన్ని మెరుగుపరచడం కోసం నా అభిప్రాయాన్ని ఇలా వ్యాసం రూపంలో రాయడం జరిగింది.  

నేను మీ SAMYEAL. CH