Doctor B.R. Ambedkar వర్థంతి, ( మహా పరినిర్వాణ దినోత్సవం) ఆయన చూపిన సమానత్వ దీప్తి , ఆయన మహా ఆత్మని మనం అందరం స్మరించుకునే రోజు డిసెంబర్ 6
ఈ రోజు మన భారత దేశ చరిత్రలో ఒక మహోత్తర దివ్య వెలుగు కాంతి మసలిన రోజు ఒక్కటే కాదు,
ఒక మంచి సమాజం కోసం ఎంతగానో అహర్నిశలు పోరాడి, శ్రమించి తన ఆఖరి శ్వాస వరకు అందరి సమానత్వం కోసం తన ఊపిరి ఉన్నంతవరకు ఒక మంచి సమాజం కోసం జీవించిన ఒక మహోత్తర మైన మనిషిని గుర్తు చేసుకునే ఒక పవిత్రమైన రోజు ఇది.
భయంకరమైన అసమానతలతో నిండి ఉన్న మన దేశంలో వెలుగు లాగ వచ్చిన ఓ ఆశాకిరణం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు.
ఇది కేవలం అంబేద్కర్ గారి జీవిత కథ మాత్రమే కాదు, ఇది ఒక భయంకరమైన యుగం యొక్క పోరాట గాథ అని నేను అనుకుంటున్నాను, ఎందుకు అంటే మన దేశంలో అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అవ్వన్నీ కొంతవరకు తగ్గి మనుషులు కొంచెం ఇప్పు డిప్పుడే మనుషులు గా గుర్తించబడి వారి హక్కులను తెలుసుకొని బ్రతుకుతున్నారు అంటే కారణం డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ గారు.
అంబేద్కర్ గారు పుట్టుకతోనే ఎలాంటి హక్కులు లేకుండా, ఇతర మనుషుల మధ్య కనీసం మనిషిగా కూడా గుర్తించ బడకుండా పెరిగిన ఈ బాలునిలో భారత రాజ్యాంగాన్ని రాసే అంతా పరికల్పన దాగి ఉందని ఏ ఒక్కరికి కూడా తెలియదు, వాళ్ళ తల్లి తండ్రులు కూడా ఊహించి ఉండరు.
అంబేద్కర్ గారు తన చిన్న తనంలో స్కూల్ కి వెళ్ళినప్పుడు తాగడానికి నీళ్లు కూడా అనుమతి ఇవ్వని సమాజంలో బ్రతికాడు.
చదువు నేర్చుకోవాలి అని ఆశతో వెళ్ళిన అంబేద్కర్ నీ కనీసం క్లాస్ రూమ్ లో కూర్చోవడానికి కూడా హక్కు లేదని బయటికి గెంటేసిన సమాజం లో బ్రతికాడు.
కనీసం అతన్ని మనిషిగా కూడా చూడని సమాజంలో బ్రతికాడు, అయినా కూడా అవ్వన్నీ భరించుకొని ఓపికతో సహించి ఎక్కడ కూడా ఆగిపోకుండా ముందుకి వెళ్ళి తర్వాత కాలంలో మన సమాజాన్ని మనిషితనం, మానవత్వం. దిశగా నడిపించిన ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు.
ఇది కేవలం త్యాగం మాత్రమే కాదు, అతను అనుభవించిన కష్టాలలో నుంచి పుట్టిన ఆలోచన, మిగతా మనుషులకు ఇలాంటి రోజులు ఉండకూడదు అని అనుకున్న అతని ధైర్యం, అతని చదువు, ఓపిక, సంస్కారం, దృడ సంకల్పం అవ్వన్నిటి వల్ల అతను అంత ఎత్తుకి ఎదిగి భారత దేశ ప్రజల అందరికి మంచి చేశాడు.
అంబేద్కర్ గారు పేదరికంలో పుట్టి పెరిగిన కానీ తన ఆలోచనల్లో ఎప్పుడూ కూడా అలాంటి భావన రాణించుకోలేదు.
అతను చెప్పిన ఒక మాట ఏంటి అంటే సమాజ ప్రగతి అంటే కేవలం డబ్బు కాదు, మనుషుల మానవత్వం, విద్యలో సమానత్వం అలాగే సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పాడు.
ఆయన బ్రతికిన రోజుల్లో కులం అనేది చాలా పెద్దది, ఆ కులం ముసుగులో మనిషిని హీనంగా చూసేవారు.
మనుషుల్లో వివక్ష ఎక్కువగా ఉండేది, మానవత్వం అనేది కనపడనే లేదు. మనుషుల్లో అజ్ఞానం అనేది ఎక్కువగా ఉండి వారి జీవిత హక్కుల కోసం అసలు అవగాహన అనేదే లేదు. అయినా కూడా అతనిలో ఆ సంకల్ప జ్వాల తగ్గలేదు, నా దేశ ప్రజలకి మంచి చేయాలి అన్న ఆలోచనలు ఎక్కడ కూడా ఆగలేదు. అతని యొక్క లక్ష్యాలు మర్చిపోలేదు. అసూయ, అంటరాని తనం, అన్యాయం ఇవ్వన్నీ తన చుట్టూ ఉన్నా కూడా అతను ఎక్కడా కూడా ఆగిపోలేదు, ప్రపంచాన్ని మార్చడానికి వచ్చిన ఒక యోధుడు లా ముందుకి వెళ్ళాడు. చదువుతో మన దేశాన్ని మార్చిన మేధావి, విద్యని ఆయుధంగా మార్చుకున్న, మార్చిన భారత దేశ మొదటి నాయకుడు అంబేద్కర్ గారు, విద్య తోనే మన జీవితాలను మార్చుకోగలం అని అందరికి నేర్పించాడు.
ఆ కాలంలో మన దేశంలో నుండి వెళ్ళి వేరే దేశంలో చదవడం అనేది సాధ్యం కాదు కానీ అయినా కూడా అతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ లాంటి ప్రపంచంలోనే అత్యంత గొప్ప యూనివర్సిటీస్ లో డిగ్రీలు సాధించిన గొప్ప మేధావి అంబేద్కర్ గారు.
ఆయన అణచివేతను చూశాడు కానీ దానికింద వంగలేదు ఎదురు తిరిగి ప్రశ్నించి పోరాడాడు.
ఆయన మీద ఎంత అసూయ అక్కసు చూపించిన అన్యాయం చేసిన కూడా అతను ఏ రోజు ద్వేషం, పగ అనేవి నేర్చుకోలేదు, కేవలం మనుషులకు కావలసిన హక్కులను మాత్రమే అడిగాడు, హింసను చేయలేదు, చేయమని చెప్పలేదు,
అజ్ఞానం అనేది గొలుసులతో మనల్ని బంధిస్తుంది కానీ విద్య మాత్రమే మనల్ని విముక్తి చేస్తుంది అని నమ్మాడు అదే ఫాలో అయ్యాడు అందరికి అదే నేర్పించాడు.
నా కులం, నా మతం, నా జనం అని నువు అనుకుంటావో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటావో అలాంటి చోట సమాజం ఎప్పటికీ అభివృద్ది చెందదు అని ఆయన చాలా సార్లు చెప్పాడు.
భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు కేవలం ఒక చట్టం అని మాత్రమే రాయలేదు, ఆది పేద ప్రజలకు, అణగారిన వర్గాలకు, మహిళలకు, పిల్లలకు వారి విద్యకు అలాగే ఆఖరికి జంతువులకు కూడా హక్కులు ఉంటాయి అని చెప్పి రాసిన మహా వ్యక్తి అంబేద్కర్ గారు.
అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మన భారత దేశం ప్రతీ ఒక్కరిదీ అందరికీ సమాన హక్కులు అవకాశాలు ఉండాలి, వివక్ష అనేది ఎవరికీ ఎవరి మీద ఉండకూడదు , ప్రతీ ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలి అని ప్రతీ ఒక్కటి కూడా అందులో పెట్టాడు.
Parag agarwal AI startups ఎందుకు స్టార్ట్ చేశాడు ఇది చదివి తెలుసుకోండి
అంబేద్కర్ గారు ఎప్పుడూ ఒక question అడిగే వారు ఆది ఏంటి అంటే:-
మానవత్వాన్ని మించిన మతం ఏదైనా ఎక్కడైనా ఉందా అని.
అందుకే ఆయన అలాంటిది ఎక్కడ ఉంది అని చూసి 1956 లో కొన్ని లక్షల మంది తో కలిసి నాగపూర్ లో బౌద్ధ ధర్మాన్ని తీసుకున్నాడు.
బౌద్ధం అంటే మానవత్వం, శాంతి, సమానత్వం. ఇది కులాన్ని కాదు మనుషులనీ మనుషులుగా చూస్తుంది. అహింస వద్దు అని చెప్తుంది. మానవ విలువలు నేర్పిస్తుంది. మంచిగా బ్రతకడం నేర్పిస్తుంది.
అందుకే అంబేద్కర్ గారు మరణించిన రోజుని బౌద్ధం లో పరినిర్వాణం అంటారు. అంటే భవ బంధాల నుండి పూర్తిగా విముక్తి పొందడం అని అర్థం.
అంబేద్కర్ గారు మరణించిన రోజు కన్నీటి రోజు కాదు అది అందరికీ స్ఫూర్తి ఇచ్చిన రోజు.
అంబేద్కర్ గారి మరణించాడు అని తెలియగానే దేశం మొత్తం కన్నీటిలోకి వెళ్ళింది.
ఆయన అంత్యక్రియలు చైత్య భూమిలో జరపడం జరిగింది.
ఆయన శరీరం గా మన మద్యలో లేకపోయిన కూడా ఆయన చెప్పిన మాటలు ఆయన ఆలోచనలు ఆయన చూపిన దారి ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచి ఉన్నాయి.
కొన్ని లక్షల మంది ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెలలో 6 వ తేదీన చైత్యభూమికి వెళ్ళి నమస్కరిస్తారు. దేశంలో బౌద్ధ ప్రార్థనలు, సభలు, ర్యాలీలు నిర్వహించి యువత ఆయన యొక్క ఆలోచనలను నేర్చుకొని ఆ లక్ష్యాలను సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తారు.
అంబేద్కర్ గారు చెప్పిన గొప్ప జీవిత పాఠాలు:-
* శిక్షణ లేకుండా నీకు విముక్తి రాదు కాబట్టి చదువుకో అదే నీ ఆయుధం నిన్ను విముక్తి చేస్తుంది అని చెప్తాడు.
*నువ్వు సైలెంట్ గా ఉంటే కచ్చితంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉండక సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించు అని చెప్పాడు.
* పగలు, ద్వేషం, అసూయ అక్కసులతో మనుషులు సమాజం చెడిపోతుంది, కూలిపోతుంది. కాబట్టి అవ్వన్నీ పక్కన పెట్టేసి విద్య తో సమాజాన్ని మేల్కొలిపి సమాజాన్ని మార్చు అని చెప్పాడు.
* వేటి కోసం ఎవరి దగ్గర తల వంచక బానిసలుగా ఉండకుండా నీ హక్కుల కోసం పోరాటం చేసి సాధించుకో అని చెప్పాడు.
* సమాజంలో ఆడపిల్లల మీద మహిళల మీద జరుగుతున్న దాడులు అణచివేతని ఎదిరించి వాళ్ళ కి సమాన గౌరవం ఇచ్చి ఈ దేశాన్ని భవిష్యత్తు తరాలను కాపాడు అని చెప్పాడు.
ముగింపు:-
ఒక యోధుడు వెళ్ళిపోయాడు కానీ ఆయన చెప్పిన మాటలు దేశానికి చూపించిన మార్గం మన అందరినీ ఇంకా నడిపిస్తూనే ఉంది.
అంబేద్కర్ గారు కేవలం మనిషి మాత్రమే కాదు
ఆయన ఒక విప్లవం
ఆయన ఒక ఆయుధం
ఆయన ఒక మార్గం
ఆయన ఒక ఆలోచన
ఆయన ఒక శతాబ్దం
ఆయన ఒక స్పూర్తి
ఆయన ఒక విశ్వ విజేత
* ఈ మహా పరినిర్వాణ దినోత్సవం రోజున అంబేద్కర్ గారికి నా శిరస్సు వంచి మా కోసం అన్నిటిని ఓర్చుకొని అన్ని హక్కులను సమానత్వాన్ని అవకాశాలను జీవితాన్ని , స్వేచ్ఛ ను ఇచ్చినందుకు దాని కోసం పోరాడి సాధించి భవిష్యత్తు తరాలకు ఇచ్చినందుకు ప్రేమతో, సంతోషం తో, ధైర్యం తో, హక్కుతో, కన్నీటితో నివాళులు అర్పిస్తున్న .
ఇది చదివాక మీకు ఎం అనిపించింది కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి విషయాల కోసం ఈ website నీ daily visit చేస్తూ ఉండండి,
నేను మీ Samyeal chirra
Thank you.

0 కామెంట్లు