Chiken biryani recipe Telugu

Chicken biryani recipe in telugu| మన ఇంట్లోనే పర్ఫెక్ట్ గా వచ్చే hotel style చికెన్ ధమ్ బిర్యాని పక్కా కొలతలతో మంచి సువాసన వచ్చేలాగా చూస్తేనే నోరు ఊరే లాగ కనిపించే ధమ్ బిర్యాని చేసుకోవడం ఎలా తెలుసుకుందాం:- 

మన భారత దేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన ఫుడ్ చికెన్ బిర్యాని, ఇది మన భారతీయ ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం కలిగిన వంటకం ఏదైనా ఉంది అంటే కూడా ఆది ఈ చికెన్ బిర్యాని, ఇంట్లో ఫంక్షన్ అయినా లేదా పండగలు అయినా లేదా weekend Saturday and Sunday వచ్చినా కూడా ఆ రోజు కచ్చితంగా చికెన్ బిర్యాని తినాలి అనుకుంటారు, చేసుకోవాలి అనుకుంటారు, ఇంకా మన చేతితో మనం చేసుకొని తింటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం కాబట్టి అందరూ ఈజీగా ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేసుకొనే చికెన్ ధమ్ బిర్యాని చేసుకుందాం తిని ఆ ఆనందాన్ని అందరితో పంచుకుందాం.

* బిర్యాని చేసేటప్పుడు తప్పకుండా తీసుకోవాల్సిన టిప్స్ తెలుసుకుంటాం.

* బిర్యాని మంచి రుచిగా కావాలి అంటే అందులో వాడాల్సిన పదార్థాలు ఏంటి ఈ ఆర్టికల్ లో మీరు తెలుసుకుంటారు.

* బిర్యాని మంచి సువాసన వచ్చి పక్కింటి వాళ్ళు ఇవ్వాళ మీ ఇంట్లో బిర్యానీ చేస్తున్నారా అని అడిగే లాగా వాసన రావాలి అంటే ఏం చేయాలి ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు.

ఇప్పుడు చికెన్ బిర్యాని తయారీకి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం:- 

- - ముందుగా చికెన్ 1 kg మంచిగా ముక్కలు కొట్టింది తీసుకోవాలి, మీకు లెగ్ పీస్ కావాలి అనుకుంటే లెగ్ పీస్ కొట్టించుకోండి.

- - 1 కప్పు పెరుగు తీసుకోండి.

- - మీకు మంచి spicy గా కావాలి అంటే ఎక్కువగా కారం ఉండే ఎర్రని కారం పొడి తీసుకోండి ఒక 2 స్పూన్లు.

- - 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ( మీరే కొన్ని అల్లం వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని పేస్ట్ లాగా చేసుకొని వాడితే ఇంకా ఎక్కువగా మంచి టేస్ట్ వస్తుంది బిర్యాని)

- గరం మసాలా పొడి - 1 టీ స్పూన్ తీసుకోండి.

- ధనియాల పొడి - 1 టీ స్పూన్ తీసుకోండి.

- ఉప్పు రుచికి సరిపడే అంత తీసుకోండి, మీరు ఎక్కువగా ఉప్పు తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే గుడ్ అలాగే మెయింటేన్ చేయాలి, ఎందుకు అంటే ఉప్పు అనేది ఆరోగ్యానికి ఎక్కువ తింటే మంచిది కాదు కాబట్టి. 

- అందులోకి చిటికెడు పసుపు తీసుకోండి.

-- అందులోకి కొంచెం నిమ్మరసం తీసుకోవాలి.

-- చికెన్ బిర్యాని లో వేయడానికి పుదినా అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

-- వాటి అన్నింటిని చికెన్ తోటి మంచిగా కలిపి కనీసం ఒక 1 గంట అయినా పక్కన పెట్టాలి అట్లా చేస్తే మసాలా మొత్తం మంచిగా ముక్కకి పట్టుకొని బిర్యానీ టేస్ట్ excellent గా ఉంటుంది తింటే wow అనాల్సిందే.

* ఇప్పుడు బిర్యానీ అన్నం కోసం ఏం పదార్థాలు కావాలో తెలుసుకుందాం:- 

- బిర్యాని అన్నం కోసం బాస్మతి రైస్ - 4 కప్పులు తీసుకోండి.

- దాల్చిన చెక్క ఒక - 3 చెక్కలు తీసుకోండి.

- లవంగాలు ఒక - 8 తీసుకోండి.

- యాలకులు ఒక - 6 తీసుకోండి.

- బిర్యానీ ఆకులు ఒక - 4 తీసుకోండి.

- ఉప్పు మీకు కావలసినంత తీసుకోండి రుచి కోసం.

Kunafa sweet making అధ్బుతం అమృతం ఇది చదివి తెలుసుకోండి

ఇప్పుడు బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం:

- పచ్చి మిరపకాయలు ఒక - 6 తీసుకోండి.

- టమటా ఒక - 2 తీసుకోండి.

- ఉల్లిగడ్డలు ఒక - 5 మీడియం సైజ్ వీ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి.

- ఆయిల్ ఒక - 5 టేబుల్ స్పూన్లు తీసుకోండి.

- బిర్యానీ రుచిగా ఉండటం కోసం నెయ్యి ఒక - 4 టేబుల్ స్పూన్లు తీసుకోండి.

* ఇప్పుడు ఫైనల్ గా చికెన్ బిర్యాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం:-

  స్టెప్- 1  బాస్మతి రైస్ నీ ముందుగా ఒక - 30 minutes మంచిగా నాననివ్వాలి.

మంచిగా నానిన తర్వాత ఒక బౌల్ లో నీళ్ళు మరిగించాలి, మంచిగా మరిగిన తర్వాత దాంట్లో సుగంధ ద్రవ్యాలను వేసుకొని తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ నీ మరిగించిన నీళ్లలో వేసుకొని ఆ రైస్ 70% ఉడికే వరకు ఉంచాలి, రైస్ పూర్తిగా ఉడికే వరకు ఉంచకూడదు అలా చేస్తే బిర్యానీ మొత్తం మెత్తగా అవుతుంది కాబట్టి రైస్ 70% ఉడికాక ఆఫ్ చేయాలి.

స్టెప్ - 2  ఇప్పుడు చికెన్ మసాలా తయారు చేసుకుందాం:- 

ఇప్పుడు పొయ్యి మీద బౌల్ పెట్టుకొని దాంట్లో నెయ్యి మరియు ఆయిల్ వేసుకొని వేడి చేయాలి, 

తర్వాత అందులో సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని అవ్వి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకొవాలి.

తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చి మిర్చి వేసుకుని ఆయిల్ లో వేయించుకోవాలి.

తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టిన టమాటా నీ కూడా అందులో వేసుకొని మెత్తగా ఉడికే వరకు ఉంచాలి.

తర్వాత మనం ముందుగా మసాలాలు పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్ నీ తీసుకొని అందులో వేసుకోవాలి, వేసుకొని మీడియం మంట పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. 


స్టెప్ - 3 ఇదే ముఖ్యమైన స్టెప్ ఆఖరి స్టెప్ లేయరింగ్:- 

ఫస్ట్ మనం రెడీ చేసుకునీ ఉడికించుకున్న చికెన్ మసాలా బౌల్ లో మంచిగా సమానంగా పరచాలి.

దాని మీద నుండి ముందుగా 70% ఉడికించుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ నీ చికెన్ మసాలా మీద వేసుకోవాలి.

మళ్ళీ సెకండ్ లేయర్ కూడా అంతే దాని మీద నుండి మళ్ళీ చికెన్ వేసుకోవాలి మళ్ళీ దాని మీద నుండి బాస్మతి రైస్ వేసుకోవాలి. ప్రతీ లేయర్ మీద కొత్తిమీర చల్లుకోవాలి.

చివరిగా దాని మీద నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి.

స్టెప్ - 4  చేసుకొని పెట్టుకున్న చికెన్ బిర్యానికి ధమ్ వేయడం:- 

ఈ స్టెప్ లో బిర్యాని ఒక 25 మినిట్స్ తక్కువ మంట మీద ధమ్ పెట్టుకోవాలి.

ధమ్ పెట్టుకుంటేనే బాస్మతి రైస్ కి చికెన్ మసాలా flavers అన్నీ కలిసి మంచి సువాసన వస్తుంది.

అంతే టేస్టీ టేస్టీ స్పైసి చికెన్  బిర్యాని రెడీ అయ్యింది. 

చికెన్ బిర్యాని ప్లేట్ లో వేసుకొని అందులోకి  పచ్చి ఆనియన్స్ కట్ చేసుకొని లెమన్ కట్ చేసుకొని, కీర ముక్కలు కట్ చేసుకొని తింటుంటే ఉంటది wow ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు. మీరు కూడా ఇప్పుడే ఈ పద్ధతిలో చికెన్ ధమ్ బిర్యాని చేసుకొని తినండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.

* ఈ బిర్యాని కరెక్ట్ మోతాదులో తింటే మంచి ప్రోటీన్, శక్తి లభిస్తుంది మంచి టేస్ట్ తోటి మంచి అనుభూతి వస్తుంది మంచి రుచికరమైన food తిన్నాం అని కానీ మరీ ఎక్కువగా తినడం వద్దు ఎక్కువగా తింటే అనారోగ్యం పాలు అవుతాం కాబట్టి ఎప్పుడో ఒక్కసారి కరెక్ట్ మోతాదులో చేసుకొని తినండి.

ఇలాంటి మంచి మంచి వంటకాల గురించి తెలుసుకోవడానికి మన website నీ daily visit చేస్తూ ఉండండి.

Thank you...