India Independence day 2025, emotional and true information, ఆగష్టు 15th భారత్ కు స్వాతంత్ర్యం రావడానికి జరిగిన ఎమోషనల్ సన్నివేశాలు, India freedom day.

 

India Independence day, India freedom day

* భారతదేశం బానిసత్వం నుండి విముక్తి పొంది, (freedom) స్వేచ్ఛ వాయువులు పొందిన రోజు ఆగష్టు 15, 1947.

-- ఎంతో మంది ప్రాణ త్యాగాలకు, భారత ప్రజల ఔన్నత్యానికి, స్వేచ్చకీ చిహ్నమే భారత స్వాతంత్ర్యం ( Independence India) దాని గురించి పూర్తి సమాచారం ఎమోషనల్ గా జరిగిన, జరుగుతున్న , జరగబోయే వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం.


-- స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారత దేశం ప్రతీ సంవత్సరం ఆగష్టు 15 రోజున దేశం అంతటా అందరూ ప్రజలు కులము, మతము ప్రాంతము అనే భేదము లేకుండా ఘనంగా జరుపుకుంటున్నాం.

-- (Indian independence history) ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైన రోజు , ఎందుకు అంటే బ్రతుకు దెరువు కోసం మన దేశం వచ్చి , కుట్రలతో, కుతంత్రాలతో మన దేశ పరిపాలనను వారి చేతుల్లోకి తీసుకొని, మనల్ని బానిసలను చేసుకొని 200 సంవత్సరాలు బ్రిటీష్ వాళ్ళు పరిపాలించారు.

-- వాళ్ళ పాలన నుండి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న రోజే ఈ రోజు. కానీ ఈ స్వేచ్చ మనకు సునాయాసంగా, సులభంగా రాలేదు, కోట్ల మంది మన భారతీయుల త్యాగం, పోరాటం, అంతేకాకుండా సహనంతో వచ్చింది, మనకు ఈ స్వాతంత్ర్యం.


* భానిసత్వం నుండి విముక్తి పొందే వరకు జరిగిన పోరాటం:-

-- 1757 ప్లాసి యుద్ధం తర్వాత బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని మన దేశంలో పెంచుకుంది. వాణిజ్యంలో దోపిడి, భయంకరమైన పన్నుల భారం, కార్మికుల అద్వాన పరిస్థితి, రైతుల పేదరిక బ్రతుకులు, దేశ ప్రజల ఔన్నత్యానికి స్వేచ్చకీ సంకెళ్లు, దేశ ప్రజల బానిసత్వం, ఇవ్వన్నీ కలిపి భారత ప్రజల్లో ఒక భయంకరమైన అసంతృప్తి ని కలిగించాయి.

-- భారత దేశంలో మొదటి స్వాతంత్ర్య సమరం 1857 లో సిపాయిల తిరుగుబాటుతో మొదలయ్యింది. ఫస్ట్ తిరుగుబాటు సఫలం కాకపోయినా కూడా ప్రజల్లో స్వాతంత్ర్యం కావాలి అన్న బలమైన ఆశయాన్ని రేకెత్తించింది.


* నాయకుల పోరాటం:-


-- స్వాతంత్ర్యానికి సంభందించిన తర్వాత కాలంలో లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధి, భగత్ సింగ్, చంద్ర శేకర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, బొబ్బిలి బ్రహ్మన్న, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది గొప్ప నాయకులు, మన భారత దేశాన్ని బ్రిటీష్ ప్రభుత్వ పాలన నుండి విముక్తి కలిగించడం కోసం అహర్నిశలు కష్టపడి పోరాడి ప్రజల ఔన్నత్యం కోసం స్వేచ్ఛ కోసం ఒక్కటిగా పోరాడారు.


* అద్భుతమైన క్షణం ఆగష్టు 15th 1947:-

-- 15th ఆగష్టు 1947, భారతదేశం ఒక కొత్త రోజుని చూసింది. జవహర్లాల్ నెహ్రు గారు రాత్రి 12 గంటలకు పార్లమెంట్లో తన "ట్రైస్ట్ విత్ డెస్టినీ" గురించి మాట్లాడటం జరిగింది. మొదటిసారి మన దేశ ఎర్రకోట పై భారత దేశ జాతీయ జెండా ఎగరవేయబడింది. అది సామాన్య జెండా మాత్రమే కాదు కోట్లాది మంది భారతీయుల త్యాగాలకు, కళలకు, ఆశలకు, స్వేచ్ఛ కు నిదర్శనమే మన జాతీయ జెండా.

భారత దేశం మీద ఎక్కువ మొత్తంలో టారిఫ్ విధించిన డోనాల్డ్ ట్రంప్ ఇది చదివి తెలుసుకోండి.


* స్వాతంత్ర్యం తో పాటు విభజన ప్రక్రియ:-


-- భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అన్న సంతోషం లేకుండా దేశ విభజన కోసం ప్రక్రియ మొదలయ్యింది.
భారత్ మరియు పాకిస్తాన్ గా దేశం రెండుగా చీలిపోవడం కోసం కోట్లాది మంది గాయాల పాలయ్యారు, లక్షలాది మంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అవ్వన్నీ జరిగిన కూడా భారతీయులు వాళ్ళ గాయాలను మరచిపోయి కొత్త దేశాన్ని నిర్మించుకోవడం కోసం పయనం మొదలుపెట్టారు.


* అసలు స్వాతంత్ర్యం యొక్క ఉద్దేశ్యం ఏంటి?


-- స్వాతంత్ర్యం వచ్చింది ఒకే కానీ, స్వాతంత్ర్యం అంటే ఎదో విదేశీ పరిపాలన నుండి విముక్తి పొందడం ఒక్కటే కాదు,  మన భారత దేశ ప్రజల భవిష్యత్తును మనమే ఒక గొప్ప స్థాయిలో అభివృధ్ధి చేసుకొని మంచిగా నిర్మించుకోవడం. 

-- మన జాతీయ జెండా ను ప్రతీ సంవత్సరం ఆగష్టు 15 రోజున ఎంతో మంది త్యాగాలను గుర్తు చేసుకొని , జాతీయ పతాకాన్ని ఎగురవేసుకొని, మన జాతీయ గీతాన్ని పాడుకొని, దేశ భక్తిని చాటి చెప్పుకుంటాం. అది మాత్రమే కాకుండా మన దేశ ప్రజల భవిష్యత్తు కోసం, సమానత్వం కోసం, అందరి అభివృద్ధి కోసం, అందరం కలిసి మెలిసి జీవించడం కోసం, దేశంలో ఇంకా ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం కోసం, దేశంలో ఉన్న రుగ్మతలను, తార తమ్యాలను రుపుమాపడం కోసం, అందరం కలిసి ఎదగడం కోసం, ప్రపంచంలో భారత దేశం గొప్పది అని చాటి చెప్పడం కోసం ఈ స్వాతంత్ర్యాన్ని మనం గొప్పగా జరుపుకోవాలి, భారత ప్రజలం అందరం ఒక్కటే అని వేరు వేరు కాదు అని మాటల్లో కాకుండా చేతల్లో చూపెట్టడం నిజమైన స్వాతంత్ర్యం.


* మన దేశ ఎర్రకోట లో జరిగే సంబరాలు:-

-- మనం ప్రతీ సంవత్సరం మన దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లీ లో ఉన్న ఎర్ర కోట దగ్గర మన దేశ ప్రధానమంత్రి జాతీయ జెండా ను ఎగరవేసి మన దేశం గురించి దేశ ప్రజల గురించి, దేశ విజయాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను అంతే కాకుండా దేశ అభవృద్ధికి సంబంధించిన అన్నీ విషయాల గురించి మాట్లాడుతారు.

-- దేశంలో ఉన్న అన్నీ పాఠశాలలలో, గవర్నమెంట్ కార్యాలయాలలో, కలాశాలలలో, ప్రతీ చోట ఈ వేడుకలు జరుగుతాయి.


* భారత భవిష్యత్తు కోసం ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి:-

-- మన దేశానికి మనకి స్వాతంత్ర్యం కోసం పోరాడి సాధించి ఇచ్చిన వారు వాళ్ళ ప్రాణాల కంటే కూడా దేశానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. 

-- కాబట్టి మన దేశ ప్రజల స్వేచ్ఛను మనం కాపాడటం మన యొక్క బాధ్యత, దేశ అభవృద్ధికి పాటు పడటం మన కర్తవ్యం, అంతే కాకుండా ఆదాయ అసమానతలు, రుగ్మతలు, అజ్ఞానం, మూఢనమ్మకాలు, లింగ భేదాలు, కుల బావనలు, మత విద్వేషాలు, పేదరికం ఇలాంటి సమస్యలు మన దేశంలో ఇంకా ఉన్నాయి, అవ్వన్నిటిని రుపు మాపడమే, అందరం కలిసి ఎదగడమే, మన దేశాన్ని ప్రపంచంలో గొప్ప దేశంగా నిలపెట్టడమే మనకు నిజమైన స్వాతంత్ర్యం. అలాగే ప్రతి పౌరుడు వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించాలి. మన దేశ చట్టాలను గౌరవించి వాటికి లోబడి నడుచుకోవాలి. మన దేశం కోసం సమాజం కోసం పని చేయాలి.  ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి దాని కోసం పాటు పడాలి అని నా అభిప్రాయం. మరి మీరు ఏం అనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.

       * ముగింపు మాటలు

* అందరికీ ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (Happy independence day), అందరం బాగుండాలి , మన దేశం బాగుండాలి దాని కోసం అందరం కలిసి మెలిసి అందరం ఒక్కటే అని సమానత్వం, సౌభ్రాతృత్వం, సహనం తో విలువలతో ప్రేమతో ముందుకు వెళ్దాం, మన దేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలపెట్టుకుందాం.              

జై భారత్ జై భారత రాజ్యాంగం వందే మాతరం 

    

    Thank you for your Reading



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు