New Income tax bill in loksabha 2025, కొత్త incometax bill ని లోక్ సభలో ప్రవేశ పెట్టారు అందులో వేటి గురించి ఉంది.

New incometax bill in 2025

 

* భారత దేశంలోని ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు, 2025 లో ప్రవేశ పెట్టిన కొత్త బిల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


* పరిచయం:-

-- (Income tax act, 1961) మన భారత దేశంలో ఆదాయపు పన్ను చట్టం 1961 నుండి, దాదాపు 63 సంవత్సరాలుగా అమలు అవుతూ వస్తుంది.
-- అప్పటి నుండి ఇప్పటివరకు మధ్య మధ్యలో అనేక సవరణలు కూడా జరిగాయి. కానీ ఆదాయపు పన్ను చట్టాన్ని మొత్తానికే మార్చే ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదు.
-- ఇప్పుడు 2025 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకొని వచ్చింది.

* కొత్త బిల్లు ఎప్పుడు వచ్చింది.

-- 11 తారీకు ఆగస్టు నెల 2025 వ రోజున కొత్త Income tax bill ని అలాగే taxation laws bill ని, రెండింటినీ కలిపి loksaba లో ఆమోదించారు.
-- ఈ రెండు బిల్లులు వ్యాపారాలు చేసేవారికి, పన్నులు చేల్లించే వారికి, గవర్నమెంట్ ఫించన్ పొందేవారికి, అలాగే పెట్టుబడి దారులకు , ఒకే రకంగా కాకుండా వేరు వేరు గా పన్నుల ప్రభావం పడే విధంగా ఈ బిల్లులు తయారు చేశారు.


*2025 Income tax bill 2 లో ఉన్న అంశాలు:-


1, ఇంతకముందు ఉన్న పాత బిల్లు నీ రద్దు చేసి కొత్త బిల్లు తీసుకొచ్చారు.

-- భారత ప్రభుత్వం 13 తారీకు ఫిబ్రవరి నెల 2025 రోజున కొత్త Income tax bill ని loksabha లో ప్రవేశపెట్టింది.
-- తర్వాత ప్రవేశ పెట్టిన ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపబడింది. తర్వాత వాళ్లు ఆ బిల్లు ని అనేక రకాల సవరణలు చేసి 21 జులై 2025 రోజున ఒక నివేదిక ఇచ్చారు.

-- తర్వాత 8 తారీకు ఆగస్టు నెల 2025 న భారత ప్రభుత్వం పాత బిల్లును రద్దు చేసి సవరణలు చేసిన కొత్త బిల్లు ను ప్రవేశ పెట్టారు.

-- తర్వాత దానికి లోక్ సభ ఆగస్టు 11, 2025 రోజున అమోధం తెలిపింది.


2, పాత బిల్లులో ఉన్న 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ని అలాగే కొనసాగిస్తుంది:-


-- ఇప్పుడు వచ్చిన కొత్త బిల్లు లో కూడా ప్రస్తుతం ఉన్న 12 లక్షల ఆదాయం పై పన్ను రాయితీ కొనసాగిస్తుంది.

-- ఇలా చేయడం వల్ల తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, అలాగే మధ్యతరగతి కుటుంబాలకి పన్ను భారం అనేది తగ్గుతుంది.

ఇది కూడా చదవండి ఇండియా మీద 25% టారిఫ్ విధించిన డోనాల్డ్ ట్రంప్.

3, ఈ పన్ను చెల్లింపులు ఎలా జరుగుతాయి:-

-- పన్ను చెల్లించే వారి లెక్కలను , పరిశీలించే విదానాన్ని ఇప్పుడు డైరెక్ట్ గా online లోనే జరుగుతాయి, ప్రత్యక్షంగా అధికారులను కలవాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల అవినీతి జరగకుండా పనులు సక్రమంగా జరుగుతాయి.

4, ఈ కొత్త చట్టంలో ఉన్న విభాగాలు :-


-- 1961 లో చేసిన పాత చట్టంలో ఉన్న 819 సెక్షన్లను ఇప్పుడు 536 సెక్షన్లకి తగ్గించారు. తర్వాత ఈ విభాగాలను అన్నింటినీ కలిపి 23 చాప్టర్లలో కుదించారు.
-- అలా చేయడం వల్ల ఈ కొత్త పన్ను చట్టాన్ని చదవడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే సులభంగా మంచిగా అర్ధం చేసుకోవచ్చు అని చెప్తున్నారు.


5, మరి TDS రీఫండ్ చేసుకునే అవకాశం ఉంటుందా ?

-- (ITR) Income tax return అనేది కచ్చితంగా గడువు పూర్తి అయ్యాక కూడా TDS రీఫండ్ కొసం ధరకాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి ఫైన్ లేకుండా రీఫండ్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, అలాంటి అవకాశం కూడా ఉంది.


6, మరి విరాళాల విధానం పారదర్శకంగా సక్రమంగా ఉంటుందా ?

-- పెద్ద మొత్తంలో ఇచ్చే విరాళాల పై ఇందులో నియంత్రణలు విధించబడ్డాయి.

-- ఇచ్చే విరాళాలు ఎందుకు ఇస్తున్నాం అనేది చాలా స్పష్టంగా వివరించి చెప్పాలి కచ్చితంగా.


7, నోటీసులు ఎలా పంపుతారు మనం ఎలా సమాధానం చెప్పాలి:-

-- పన్నులు వసూలు చేసే అధికారులు చర్యలు తీసుకునేముందు చెల్లింపు దారులకు కచ్చితంగా నోటీసులు పంపాలి.
-- దాని వల్ల పన్ను చెల్లింపు దారులు వారి యొక్క సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది.


* 2025 పన్ను చట్టం బిల్లులో ఉన్న ముఖ్యమైన అంశాలు:-

1, NPS అలాగే UPS కి సమానత్వం ఉంటుందా ?


-- NPS (National pension system) ఎది అయితే ఉందో అలాగే UPS ( Unified pension scheme) లో ఫించన్ తీసుకునేవారు NPS విధానాలకు సమానంగా పన్ను రాయితీలు పొందుతారు.

-- lump sum withdraws అలాగే ముందస్తు విరమణ పై NPS లో ఉన్న మినహాయింపులు అన్నీ UPS కి కూడా వర్తిస్తాయి.


2, మరి ఫించను పొందే వారికి దీని వల్ల లాభం ఏంటి?


-- దీని వల్ల ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగుల్లో UPS లో చేరిన వారికి ఇది ఒక పెద్ద లాభం గా మారుతుంది.

-- వాళ్ల మీద పన్ను భారం తగ్గి , వాళ్లు తీసుకునే ఫించన్ మొత్తం పై నికర లాభం పెరుగుతుంది.


* మరి ఈ మార్పులు ఎందుకు అవసరం?

1, ఇప్పుడు కొత్తగా వచ్చిన పన్ను చట్టాన్ని చదవడం, అలాగే ఆ చట్టాన్ని అమలు పరచడం చాలా సులభం అవుతుంది.


2, పన్ను చట్టాన్ని పారదర్శకంగా సక్రమంగా faceless assessment తో అవినీతి అనేది తగ్గే అవకాశముంది.


3, UPS సభ్యులు ఎవరు అయితే ఉన్నారో వాళ్లు NPS సభ్యుల లాగే సమానంగా మినహాయింపులు పొందవచ్చు.

4, TDS రీ ఫండ్ టైమ్ అయిపోయాక కూడా మళ్ళీ రీఫండ్ పెట్టుకోవడం కోసం అదనపు అవకాశం కల్పించబడింది.

5, తక్కువ ఆదాయం కలిగిన వాళ్లు అలాగే మధ్యతరగతి కుటుంభాలకి 12 లక్షల వరకు ఆదాయంలో ఉపషమనం కలిగించే మినహాయింపు అలాగే కొనసాగుతుంది.


* కొత్త చట్టం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది?

-- తక్కువ ఆదాయం ఉన్న వారికి వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులకి ఉపశమనం కలిగే అవకాశం ఉంది అలాగే online సౌకర్యాలు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి.

-- వ్యాపారాలు మరియు పన్ను చట్టాల క్లిష్టత అనేది తగ్గుతుంది.

- ఫించను తీసుకునేవారు UPS మరియు NPS ల మధ్య పన్ను తేడా అనేది లేకుండా సమానం అవుతుంది.

- ప్రభుత్వానికి పన్ను సేకరించడంలో పారదర్శకత అనేది పెరుగుతుంది.



* ముగింపు విషయాలు:-

-- 2025 కొత్త ఆదాయపు పన్ను చట్టంలో తీసుకొని వచ్చిన ఈ మార్పులు భారత దేశ పన్ను చరిత్రలో ఒక పెద్ద సాహసం అని చెప్పుకోవచ్చు.

-- 2025 కొత్త Income tax bill 2 ద్వారా పన్ను చట్టాన్ని పారదర్శకంగా సక్రమంగా సులభతరం చేయడం, ప్రజలకి పన్ను విషయంలో సౌకర్యాన్ని కల్పించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పుకోవచ్చు.

-- ఆదాయపు పన్ను చట్టాలు బిల్ 2025 ద్వారా NPS మరియు UPS ల మధ్య సమానత్వం తీసుకొని వచ్చి దాని వల్ల ఫించన్లు తీసుకునే వారికి న్యాయం చేయబడుతుంది.

-- ఇవి అన్నీ కలిపి మన దేశ పన్ను విదానాన్ని ఆధునికంగా మంచి స్థాయిలో ఉంచడానికి అలాగే మన దేశ ఆర్థిక వ్యవస్థ కు స్థిరత్వాన్ని కల్పించడం కోసం ఈ కొత్త బిల్లు చట్టాలు కీలక పాత్ర పోషిస్తాయి అని చెబుతున్నారు. 

-- మరి ఈ విషయంలో మీరు ఏం అనుకుంటున్నారో తెలియచేయండి , ఈ కొత్త చట్టం అమలు మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.



 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు