Most trending food item in 2025 kunafa


* Social media platform లో 2025 వ సంవత్సరంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ఫుడ్ ఐటమ్ ఏంటి అంటే kunafa sweet:- 

* అసలు ఈ kunafa food item ఎక్కడ నుండి వచ్చింది, kunafa అంటే ఏంటి, దీన్ని ఇంట్లో ఎలా తయారు చేయాలి అన్నీ విషయాలు క్లారిటీగా తెలుసుకుందాం.

* ఈ kunafa sweet నీ ఇంట్లో పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలి step by step ఇప్పుడు తెలుసుకుందాం.

* ముందుగా అసలు kunafa అంటే ఏంటి?

- - kunafa అనే ఫుడ్ ఐటమ్ మధ్యప్రాచ్యంలో దొరికే ఒక ప్రసిద్ధ మిఠాయి.

ఇది చూడటానికి బయటికి క్రిస్పీగా కనపడుతుంది. లోపల మృదువుగా క్రీమ్ తోటీ నిండి ఉంటుంది. దాన్ని పట్టుకొని తింటే చాలా మధురంగా ఉంటుంది.

 * ఇప్పుడు అది ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

- - దీన్ని చేయడం కోసం ఒక నాన్ స్టిక్ బౌల్ ఉండాలి.

- - kunafa తయారీ కి కావలసిన పదార్థాలు :- 

- సేమియా (vermicelli) ఒక 200 గ్రాములు తీసుకొని వాటిని చిన్నగా ముక్కలుగా విడగొట్టాలి.

- నెయ్యి ఒక 5 టేబుల్ స్పూన్లు తీసుకోండి.

- మిఠాయి colour full గా కనిపించాలి అనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ లేదా మీకు నచ్చిన కలర్ కొంచెం తీసుకోండి కలర్ వద్దు అనుకుంటే వదిలేయండి.

- చీజ్ నింపడం కోసం కావలసిన పదార్థాలు:- 

 - -  క్రీమ్ చీజ్ - 1/3 కప్పు తీసుకోండి. ఒకవేళ క్రీమ్ చీజ్ లేకపోతే పనీర్+పాలు నీ బ్లెండ్ చేసి వాడుకోవచ్చు.

- -  కిస్మిస్ మరియు పిస్తా పొడి ఒక 3 టేబుల్ స్పూన్లు.

* ఇప్పుడు చక్కెర పాకం తయారీ కోసం కావాల్సిన పదార్థాలు:- 

పంచదార - 1 and half Cup తీసుకోండి 

నీళ్లు - 1 and half Cup తీసుకోండి 

కొంచెం నిమ్మరసం తీసుకోండి

కొంచెం యాలకల పొడి తీసుకోండి


* ఇప్పుడు తయారీ చూద్దాం:- 

స్టెప్- 1 చక్కెర పాకం తయారీ విధానం:- 

- - ఒక గిన్నెలో ముందుగా కప్పు నరా నీళ్లు మరియు కప్పు నరా చక్కెర వేసుకొని మరిగించాలి.

- - పంచదార మంచిగా కరిగిన తరువాత యాలకల పొడి వేసి కలపాలి.

- - తర్వాత కొంచెం నిమ్మరసం వేసి కొంచెం సేపు మరిగించాలి.

- - తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చక్కెర పాకం నీ పక్కన పెట్టుకోవాలి కొంచెం warm గా ఉండాలి.

 ఇది కూడా చదవండి హెపటైటిస్ D క్యాన్సర్ గురించి

స్టెప్ -2 

Kunafa కోసం సేమియా తయారి:- 

- - ముందుగా సేమియా ని చిన్న చిన్న ముక్కలు గా చేసుకోండి.

- - ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేయండి.

- - నెయ్యి వేడి అయిన తర్వాత సేమియా పాన్ లో వేసి low flame లో ఒక 6 నిమిషాలు వేయించండి.

- - సేమియా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి.


స్టెప్- 3 చీజ్ ఫిల్లింగ్ నీ తయారు చేయడం:- 

- - ముందుగా ఒక బౌల్ లో క్రీమ్ చీజ్ 1/3 కప్పులు తీసుకోండి 

- - 2 స్పూన్ల పాలు తీసుకోండి.

- - కొంచెం బాదం పొడి వేసి కలపాలి 

- - ఒకవేళ మీరు పనీర్ యూస్ చేస్తే పనీర్ మరియు పాలు మరియు 1 టేబుల్ స్పూన్ condensed milk వేసి బ్లెండ్ చెయ్యండి 


స్టెప్ - 4 ఇప్పుడు kunafa లేయర్ రెడీ చేసుకుందాం:- 

- - నెయ్యి పూసిన ఒక పాన్ తీసుకోండి

- - ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియా 2/3 వ వంతు ఆ పాన్ లో వేసుకొని ప్రెస్ చెయ్యండి.

- - తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న చీజ్ నీ దాని మీద సమానంగా పూయండి.

- - తర్వాత మిగిలిన సేమియా చీజ్ మీద వేయండి.

- - ఇప్పుడు తక్కువ మంట మీద దానిని 10 నుండి 15 నిముషాల వరకు ఉంచండి.

- - తర్వాత ఒక్కసారి క్రింది భాగం చుడండి ఒకవేళ క్రింది భాగం క్రిస్పీగా అయితే నెమ్మదిగా దాన్ని తిప్పి వేరే వైపు వేసి ఒక 5 నిమిషాలు ఉంచండి. ఒకవేళ అది తిప్పడం కష్టం ఐతే low flame లో ఒక 15 నిముషాలు కుక్ చేస్తే క్రిస్పీగా అవుతుంది అది మీరు గమనించుకుంటూ చెయ్యండి.


స్టెప్ - 5 ముందుగా తయారు చేసి పెట్టుకున్న చక్కెర పాకం పోసుకునే విధానం:- 

- - చేసిన kunafa వేడి గా ఉన్నప్పుడే దాని మీద ఆల్రెడీ ముందే తయారు చేసి పెట్టుకున్న వెచ్చగా ఉన్న చక్కెర పాకం నీ నెమ్మదిగా పోసుకోవాలి. ఒకేసారి మొత్తం పాకం పోయకండి , సగం పోసి ఆది మంచిగా soak అయిన తర్వాత మిగిలిన పాకం కూడా పోయండి


స్టెప్ - 6 అంతా అయిపోయాక మీద అందంగా కనపడటం కోసం:- 

- - బాదం, కిస్మిస్, పిస్తా రోజ్ పెటల్స్ మంచిగా చల్లండి.

దానితో మీ ఇంట్లోనే పర్ఫెక్ట్ గా kunafa sweet రెడీ 

- - మీరు తయారు చేసుకున్న kunafa వేడి వేడి గా ఉన్నప్పుడే తినేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది.

- - బయటికి చూడటానికి క్రిస్పీగా లోపల మాత్రం సాఫ్టుగా ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తూ తినండి.

మీరు ఈ పద్ధతులు అన్ని ఉపయోగించి చేసి తిని ఎలా ఉందో comment చెయ్యండి, 

ఇలాంటి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తయారీ కోసం మన website నీ daily చూస్తూ ఉండండి.


అసలు ఈ kunafa sweet 2025 లో ఎందుకు ట్రెండింగ్ లో ఉంది అనేది చెప్పలేదు కదా ఎందుకు ట్రెండింగ్ లో ఉంది అంటే 

Instagram reels లో ఈ kunafa బాగా వైరల్ అయ్యింది.

ఫుడ్ vloggers దీన్ని చూపించడం, తినడం ఆది బయటికి చూడటానికి క్రిస్పీగా లోపల soft గా ఉండటం మంచి రుచిగా ఉండటం, తినేటప్పుడు చూసేవారికి తినాలి అనిపించేలా ఈ kunafa కనబడేసరికి అందరూ లైక్ చేయడం షేర్ చేయడం వల్ల అందరికి తెలిసింది. అందరూ దాన్ని చేసుకోవడం తినడం, orders పెట్టుకోవడం, ఇంట్లోనే చేసుకోవడం పెరిగింది. హోమ్ making ట్రెండ్ పెరగడం సోషల్ మీడియాలో అలాగే కేఫ్ లలో కొత్త కొత్త వేరియేషన్స్ రావడం పెరిగింది people దానికి attract అవ్వడం వల్ల 2025 మొత్తం ఈ kunafa ట్రెండ్ అవుతూనే ఉంది.

మీరు కూడా ఒక్కసారి try చేయండి తిని ఎలా ఉందో నాకు తెలియచేయండి.

Thank you.