ICC cricket T20 World Cup - 2026 కోసం టికెట్స్ సేల్ అవుతున్నాయి, దాని గురించి పూర్తి వివరాలు ఈ పోస్ట్ లో చెప్తాను.
ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ 2026 రానే వచ్చింది. అందులో భాగంగా ఆ వరల్డ్ కప్ మ్యాచెస్ లైవ్ గా స్టేడియం లలో చూడటానికి టికెట్స్ అమ్మకం అధికారికంగా ఇవ్వాళ అంటే 11- 12- 2025 రోజున ప్రారంభించారు.
2026 లో జరగబోయే ఈ వరల్డ్ కప్ మీద ఇప్పటికే అభిమానులు బారి హైప్ పెంచుకున్నారు.
అందులో మెయిన్ గా ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్, శ్రీలంక లాంటి దేశాల ఫ్యాన్స్ వారి యొక్క ఇష్టమైన టీమ్స్ stadium లో ఆడుతుంటే ప్రత్యక్షంగా చూడాలని టికెట్స్ ముందే బుక్ చేసుకుంటారు. ఇవ్వాళ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆల్రెడీ చాలా మంది టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు .
నేను రాసిన ఈ పోస్టులో మీరు వేటి గురించి తెలుసుకుంటారు అంటే?
- టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ?
- ఎక్కడ బుక్ చేసుకోవాలి ?
- టికెట్స్ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ?
- ఎక్కువగా బుకింగ్ అవుతున్న మ్యాచెస్ ఏంటి ?
- టికెట్స్ బుక్ చేసేటప్పుడు కొన్ని ఫేక్ websites కూడా అమ్ముతారు అలాంటి scams నుండి ఎలా జాగ్రత్తగా చేసుకోవాలి అని ఇందులో తెలుసుకోవచ్చు.
- ఏ స్టేడియంలో ఎంత ధర ఉందో తెలియచేస్తాను.
2026 టీ20 వరల్డ్ కప్ గురించి వివరణ:-
ఈసారి ఈ టీ20 వరల్డ్ కప్ ను రెండు దేశాలు కలిసి నిర్వహించబోతున్నాయి అవి ఇండియా మరియు శ్రీలంక, రెండు దేశాలు కలిసి నిర్వహించబోతున్నాయి కాబట్టి ఈసారి ఈ వరల్డ్ కప్ మరింత స్పెషల్ గా ఉండబోతుంది. ఈసారి ఈ వరల్డ్ కప్ లో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయి, అందులో group stage, super 12, semi final మరియు final rounds ఉంటాయి.
అందులో భాగంగా ICC world cup కి సంబందించిన మ్యాచెస్ tickets నీ online లో పెట్టారు, ప్రపంచ వ్యాప్తంగా ఈ వరల్డ్ కప్ కి బారీ డిమాండ్ ఉంది కాబట్టి, టికెట్స్ online లో పెట్టిన వెంటనే website లు traffic తో నిండిపోయేలా ఫ్యాన్స్ లాగిన్ అవుతున్నారు.
మరి ఈ టికెట్స్ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ?
ICC ఇచ్చిన అధికారిక ప్రకటన ద్వారా ఫేస్ 1 టికెట్ సేల్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, పబ్లిక్ కోసం జనరల్ టిక్కెట్ సేల్ నీ దశల వారీగా విడుదల చేస్తుంది.
ముందుగా ICC members కి అలాగే mastercard యూస్ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా స్లాట్ పెట్టారు.
ఒక్కొక్క dates లో ఒక్కొక్క మ్యాచ్ ల టికెట్స్ విడుదల చేస్తుంది ICC.
మరి టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలా ?
Official website lo మాత్రమే మీరు టికెట్స్ బుక్ చేసుకోండి.
Official website:- tickets.cricketworldcup.icc.com
లేదంటే icc-cricket.com లో టికెట్స్ సెక్షన్ అని ఉంటుంది ఆది క్లిక్ చేసి అందులో అయిన మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
డేంజర్:- మీరు official website నుండి కాకుండా వేరే థర్డ్ పార్టీ website నుండి tickets బుక్ చేయకండి, ఎందుకు అంటే ఫేక్ టికెట్స్ పెట్టి scam చేసే website లు చాలా ఉన్నాయి అందుకోసమే మీరు కేవలం official website లో మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోండి.
Parag agarwal ఎవరు? అతను AI startups ఎందుకు స్టార్ట్ చేశాడు ఇది చదివి తెలుసుకోండి.
టికెట్స్ ధరలు (prices) ఎంత ఉన్నాయి ?
టికెట్స్ ధరలు అనేవి దేశాన్ని బట్టి మ్యాచ్ ను బట్టి ఆ మ్యాచ్ కి ఉన్న డిమాండ్ ని బట్టి ధరల ఉన్నాయి.
ఇప్పుడు మన ఇండియా stadium లలో ఎంత ధరలు ఉన్నాయో తెలుసుకుందాం.
Group stage లో అయితే ₹900 - ₹3,500 ఉంది.
అందులో మన ఇండియా మ్యాచ్ చూడాలి అంటే ₹2000 నుండి ₹12,000 వరకు ఉంది.
Next super 12 matches కి ₹18,00 నుండి ₹6,500 వరకు ఉంది.
సెమీ ఫైనల్ మ్యాచ్ కి ₹4,000 నుండి 18,000 వరకు ఉంది.
ఫైనల్ మ్యాచ్ కి ₹7,000 నుండి ₹30,000 వరకు ఉంది.
ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతుంది.
ఇప్పుడు శ్రీలంక లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం:-
₹500 నుండి ₹5,000 వరకూ దాదాపుగా ఉంది.
ఇప్పుడు ఏ మ్యాచ్ లకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకుందాం:-
ప్రస్తుతం ఎక్కువగా హాట్ కేక్ లాగా బుక్ అవుతున్న మ్యాచ్ లు ఏంటో తెలుసుకుందాం
1, ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ అత్యధికంగా టిక్కెట్లు బుక్ అవుతున్నాయి ఈ మ్యాచ్ కి బారీ డిమాండ్ ఉంది, ఫ్యాన్స్ ఈ మ్యాచ్ టికెట్స్ కోసం ఎగబడుతున్నారు.
2, group స్టేజ్ లో జరిగే ఇండియా మ్యాచ్ లకు ఎక్కువ డిమాండ్ ఉంది.
3, సెమీ ఫైనల్ మ్యాచ్ లకు కూడా డిమాండ్ ఉంది.
4, తర్వాత ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్ మ్యాచ్ కి కూడా బారీగా డిమాండ్ ఉంది.
5, తర్వాత శ్రీలంక లో జరగబోయే వీక్ ఎండ్ మ్యాచులకు కూడా డిమాండ్ ఉంది.
6, మెయిన్ గా ఫైనల్ మ్యాచ్ కి బారీ డిమాండ్ అయితే నెలకొంది, final match అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్రమోడీ స్టేడియం లో జరుగుతుంది ఈ మ్యాచ్ కి బారీ డిమాండ్ అయితే నెలకొంది.
ఇప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలా అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం:-
ఒక్క వ్యక్తి కేవలం వాళ్ళ account నుండి 4 -6 tickets మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది.
ఇంకా ఎక్కువ టికెట్స్ కావాలి అంటే వేరే అకౌంట్ నుండి బుక్ చేసుకోవచ్చు.
స్టెప్ 1:- కేవలం మీరు ICC official website మాత్రమే open చేసి book చేసుకోండి.
స్టెప్ 2:- ఆల్రెడీ icc account ఉన్న వాళ్ళు డైరెక్ login అవ్వండి, account లేని వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
స్టెప్ 3:- మీరు ఏ మ్యాచ్ కి సంబందించిన టిక్కెట్ కావాలి అనుకుంటున్నారో ఆ మ్యాచ్ నీ సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్ 4:- మీకు ఏ సీటు కావాలో సెలెక్ట్ చేసుకోవాలి.
స్టాండర్డ్ సీటు కావాలో
ప్రీమియం సీటు కావాలో
పెవిలియన్ సీటు కావాలో
కార్పొరేట్ boxes లో సీటు కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ :- 5 payment మెథడ్.
మీరు UPI ద్వారా బుక్ చేస్తారా, లేదా card ద్వారా బుక్ చేస్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 6:- మీ email కి బుకింగ్ సక్సెస్ అని వస్తుంది లేదా e -ticket వస్తుంది చెక్ చేసుకోండి.
మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటి?
ఫేక్ టికెట్స్ website లో పెట్టి scam లు జరుగుతాయి. ఇది ఒక పెద్ద టోర్నమెంట్ కాబట్టి ఇలాంటి సమయంలో చాలా ఫేక్ టికెట్స్ మార్కెట్ లోకి వస్తాయి. ఆఫర్స్ ఉన్నాయి సగం రేటు కే ఇస్తాం టికెట్స్ అని అట్రాక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఎవరు మోసపోకండి జాగ్రత్తగా ఉండండి.
QR code tampering కూడా జరగొచ్చు కాబట్టి official website మాత్రమే open చేసి book చేసుకోండి.
ఈ మెగా ఈవెంట్ కి ఆతిథ్యం ఇవ్వబోతున్న places and stadiums ఏంటి?
ఇండియా లో ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ జరగబోయే stadiums:-
1, Mumbai - వాంఖేడే stadium.
2, delhi - అరుణ్ జైట్లీ స్టేడియం.
3, hyderabad - ఉప్పల్ స్టేడియం.
4, kolkata - ఈడెన్ గార్డెన్స్ స్టేడియం.
5, Ahmedabad - నరేంద్ర మోడీ స్టేడియం.
6, Chennai - చేపాక్ స్టేడియం.
7, lucknow - Ekana స్టేడియం.
8, bengaluru - చిన్న స్వామి స్టేడియం.
శ్రీలంక లో ఉన్న stadiums:-
1, Colombo
2, Kandy
3, Galle
ఈ టీ20 వరల్డ్ కప్ ఎందుకు special అవుతుంది ?
ఈ వరల్డ్ కప్ ఇండియా మరియు శ్రీలంక కలిసి నిర్వహించబోతున్నాయి కాబట్టి.
ఈ వరల్డ్ కప్ లో మొత్తం 20 జట్లు పోటీ పడుతున్నాయి కాబట్టి, ఇప్పటివరకు ఇదే పెద్ద సంఖ్యలో జట్లను ఆడించ బోతున్న వరల్డ్ కప్ ఇదే కాబట్టి.
ఈ వరల్డ్ కప్ లో ఎక్కువగా యంగ్ ప్లేయర్స్ ఆడబోతున్నారు కాబట్టి.
ప్రపంచంలో పెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్రమోడీ స్టేడియం లో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఈ వరల్డ్ కప్ special కానుంది.
ముగింపు:-
ఈసారి ఈ వరల్డ్ కప్ 2026 లో ప్రారంభం కాబోతోంది కాబట్టి టికెట్స్ ఆన్లైన్ లో విడుదల చేశారు దాంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ లైవ్ చూడటం కోసం, మీ అభిమాన టీమ్ మ్యాచ్ చూడటం కోసం ముందే టికెట్స్ బుకింగ్ చేసుకొని చుడండి.
మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకుంటే కామెంట్ చేయండి. ఇలాంటి విషయాల కోసం మన website నీ daily visit చేస్తూ ఉండండి.
Thank you...

0 కామెంట్లు